
నందిగామలో టెర్రస్ గార్డెన్స్ పరిశీలించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ పట్టణం 15వ మరియు 16వ వార్డులలో శనివారం నాడు ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, అధికారులు మరియు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటా పాక్షికంగా ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్స్‌ను పరిశీలిస్తూ,పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
టెర్రస్ గార్డెన్స్ ద్వారా ఆరోగ్యకరమైన కూరగాయలు సాగు చేయడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల పైభాగాల్లో చిన్న తోటలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛభారత్ కింద టెర్రస్ గార్డెన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15వ వార్డు షేక్ షకీరా అవార్డు పొందినందుకుగాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా ఆమెను అభినందించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు స్థానికులు పాల్గొని ఎమ్మెల్యే సూచనలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని వార్డుల్లో కూడా ఇలాంటి పచ్చదనం కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
![]()
