
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 22, 2025
పీడీఎస్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ
- అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జేసీ ఇలక్కియ
అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని.. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ హెచ్చరించారు.
జేసీ ఇలక్కియ శనివారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా తనిఖీలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలపై చర్చించారు. పీడీఎస్ బియాన్ని అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వివిధ మార్గాల్లో సేకరించి కోళ్ల ఫారాల్లో, చేపల చెరువుల్లో ఉపయోగించడం, రీసైక్లింగ్ చేయడం చట్ట వ్యతిరేక చర్యలని పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై గట్టి నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు, సహాయ పౌర సరఫరాల అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, చెకింగ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
![]()
