అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 8 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.

Spread the love

జయవాడ, 20 – 11 – 2025

  • అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 8 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.
  • ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం.
  • రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల్లో 20 కోట్లకు పైగా మెగా డెవలప్మెంట్స్
  • ప్రభుత్వం అనుమతి, సహకారంతో ముందుకు వెళ్తాం.
  • షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.

విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 8 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఇటీవల సౌదీ అరేబియాలో మృతి చెందిన 42 మందికి సంతాపంగా ప్రత్యేక దువా ప్రార్థన కార్యక్రమం నిర్వహించిన అనంతరం బోర్డ్ సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం చేసి, పలు మ్యానేజింగ్ కమిటీలు, ముతవల్లీలను నియమించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల్లో 20 కోట్లకు పైగా చేపట్టనున్న మెగా డెవలప్మెంట్ ప్లాన్స్ ను ఎన్సీపీఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు వక్ఫ్ ప్రాపర్టీస్ యుటిలైజేషన్ ప్లాన్ ను బోర్డ్ సభ్యులకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పలు వక్ఫ్ స్థలాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బోర్డు అంగీకరించిందని వాటికి సంబంధించి 20 కోట్లకు పైగా మెగా డెవలప్మెంట్ ప్లాన్స్ వివరాలను ఎన్సీపీఈ సంస్థ వారు వివరించారని తెలిపారు. సదరు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం అనుమతి, సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ ప్రణాళికలు అమల్లోకి వస్తే, వక్ఫ్ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, ముస్లిం సమాజం బాగుపడుతుందని తెలిపారు. ఒక వక్ఫ్ సంస్థ నిధులను రుణంగా తీసుకుని, మరొక వక్ఫ్ సంస్థ ఆస్తుల అభివృద్ధికి ఉపయోగించేలా తీర్మానించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను కాపాడుతూ వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను చేపడతామని తెలిపారు. సమావేశంలో బోర్డ్ సభ్యులైన శాసన మండలి సభ్యులు రుహుల్లా, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముక్రం హుస్సేన్, బేపారి జాకీర్ అహమద్ సీఈఓ మొహమ్మద్ అలీ వక్ఫ్ అధికారులు పాల్గొన్నారు.

Loading