ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ పాపాలు పండాయి.. జ‌గ‌న్ వైఖ‌రిని న్యాయ‌స్థానం చాలా సీరియ‌స్ గా తీసుకుంటాయి.

Spread the love

ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ పాపాలు పండాయి.. జ‌గ‌న్ వైఖ‌రిని న్యాయ‌స్థానం చాలా సీరియ‌స్ గా తీసుకుంటాయి.
రాబోయే ఎన్నిక‌ల్లో పులివెందుల్లో జ‌గ‌న్ ఎమ్మెల్యేగా గెలవ‌లేని ప‌రిస్థితి : ఎంపీ కేశినేని శివనాథ్
కోర్టుకు హాజ‌రు కాకుండా వుండేందుకు జ‌గ‌న్ డ్రామాలు
కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న
మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జ‌గ‌న్ వైఖ‌రిపై ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఫైర్

విజ‌య‌వాడ : పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా వున్న‌ప్పుడు హైకోర్టు న్యాయ‌మూర్తులు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల‌ను బెదిరించిన ప‌రిస్థితి వుంది. ఎమ్మెల్యే జ‌గ‌న్ కోర్టు పైన కానీ, న్యాయ‌వ్య‌వ‌స్థ పై ఎలాంటి గౌర‌వం లేద‌ని…కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించి వాయిదాల‌కు హాజ‌రుకాకుండా వుండేందుకు డ్రామాలు ఆడుతున్నాడ‌ని ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ మండిప‌డ్డారు.

ఆరేళ్ల త‌ర్వాత నాంప‌ల్లి సిబిఐ కోర్ట్ కు హాజ‌రైందుకు ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఊరేగింపుగా వెళ్లిన ఉదంతాన్ని ఖండిస్తూ ఎంపీ కేశినేని శివ‌నాథ్ గురువారం త‌న కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ వింత పోక‌డ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి వెళ్లితే…ఎమ్మెల్యే జ‌గ‌న్ నాంప‌ల్లి సిబిఐ కోర్టుకు వెళ్లాడన్నారు.

కోర్టుల‌కు నిందితులు ఎవ‌రైనా ఒక్క‌రే వెళ‌తార‌ని, ఎమ్మెల్యే జ‌గ‌న్ మాత్రం ఒక ఊరేగింపుగా వెళ్లి, కోర్టును త‌న పెయిడ్ ఆర్టిస్టుల‌తో నింపేశాడ‌న్నారు. దాదాపు 64 వేల కోట్ల రూపాయిలు మింగేసిన ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరేళ్లుగా కోర్టు వాయిదాల వెళ్ల‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌న్నారు.

ఈ కేసు సంబంధించి కోర్ట్ వాయిదాల‌కు హాజ‌రు కాకుండా వుండేందుకు,తాను వ‌స్తే శాంతి భ‌ద్ర‌త‌లకు ఆటంకం క‌లుగుతుంద‌ని న‌మ్మించటానికి ఊరేగింపు కార్య‌క్ర‌మం నిర్వ‌హించాడ‌న్నారు. త‌న‌ను వాయిదాల‌కు రాకుండా మిన‌హాయింపు ఇవ్వాల‌నే దోర‌ణి తోనే ఎమ్మెల్యే జ‌గ‌న్ కోర్టు హాజ‌రుకావ‌టం జ‌రిగింద‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా న్యాయ స్థానం చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. ఊరేగింపుగా కోర్టు రావ‌టం, కోర్టును దిగ్బంద‌నం చేయ‌టం ఏమిటని ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ కోర్ట్ కు రాకుండా వుండేందుకు డ్రామాలు ఆడుతున్నాడని, త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అడ్డు పెట్టుకుని త‌ను కోర్టుకు హాజ‌రతే ప్రజాధ‌నం వృద్దా అవుతుందంటూ, , స‌మ‌యం వృద్దా అవుతుంటూ కోర్టు నుంచి మిన‌హాయింపు తీసుకున్నాడని, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌టం ఒక అల‌వాటుగా మారింద‌న్నారు.

అక్ర‌మ కేసులో చంద్ర‌బాబు ను అరెస్ట్ చేసిన‌ప్పుడు న్యాయ‌ప‌రిధికి లోబ‌డి వ్య‌వ‌హ‌రించామన్నారు. బ్లూ మీడియా ను అడ్డుపెట్టుకుని ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ర‌ప్పా ర‌ప్పా 2029 అంటూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గ‌రి చేస్తున్నాడ‌న్నారు. ర‌ప్పా, ర‌ప్పా 2029 భ‌య‌భ్రాంతులు గురి చేశారు. అదే విధంగా నాంపల్లి కోర్టు లో ర‌ప్పా రప్పా బ్యాన‌ర్లు, ప‌ట్టుకుని పెయిడ్ బ్యాచ్ రెచ్చిపోయార‌ని… త‌ప్ప‌కుండా వీటిపై చ‌ర్య‌లు వుండాలన్నారు..సోష‌ల్ మీడియాలో వైసిపి అరాచ‌కం చూస్తే స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునే ప‌రిస్థితి వుందన్నారు.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి ఎపీ ప్ర‌జ‌లు త‌రిమికొట్టారు. ప్ర‌జ‌ల‌మీద క‌క్ష తీర్చుకోవాల‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్ ప్ర‌వ‌రిస్తున్నాడ‌న్నారు. అధికారం పోయిన‌నాటి నుంచి గంజాయి బ్లేడ్ బ్యాచ్ ల‌ను వెంట వేసుకుని
తిరుగుతూ, ప్ర‌భుత్వ ఆస్తుల‌కు, ప్ర‌జ‌ల‌ ఆస్తుల‌కు న‌ష్టంక‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడన్నారు..

అందుకే రాష్ట్రానికి ఎలాంటి పరిశ్ర‌మ‌లు రాకుండా వుండాల‌నే ల‌క్ష్యంతో , ఎటువంటి సంక్షేమం జ‌ర‌గ‌కుండా వుండాల‌నే త‌లంపు తో 2029లో తాను ముఖ్య‌మంత్రి కాగానే ర‌ప్పా ర‌ప్పా ఆడించేస్తానంటూ ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే పారిశ్రామిక‌ వేత్త‌ల‌ను అడ్డుకోవ‌టానికి కుట్రలు చేస్తున్నాడ‌న్నారు. జ‌గ‌న్ డ్రామాలు ప్ర‌జ‌లే కాదు..పారిశ్రామిక వేత్త‌లు కూడా నమ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌…రాష్ట్రంలో జ‌రిగితే ఇక్క‌డ వున్న ప్ర‌జ‌లు ఊరుకునే ప‌రిస్థితి లేదని హెచ్చ‌రించారు.
మ‌రోసారి కోర్టులో ఇలాంటి సంఘ‌ట‌నలు పున‌రావృతం కాకుండా వుండేందుకు న్యాయ‌స్థానాల‌కు టిడిపి త‌రుఫున ఒక విన‌తిప‌త్రం ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబు ను కోర‌తామ‌న్నారు.

వాస్త‌వంగా హైద‌రాబాద్ లో వైకాపాకి ఒక కార్య‌క‌ర్త కూడా లేని ప‌రిస్థితి వుంద‌న్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జ‌నాలు స‌మీక‌రించి త‌ర‌లించార‌న్నారు. ఈ ప‌థ‌కం ప్ర‌ణాళిక ర‌చ‌న అంతా తాడేప‌ల్లి ప్యాలెస్ జ‌రిగింద‌న్నారు.

కోర్టులో దృష్టిలో ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొ అవినీతి ప‌రుడు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న నిందితుడన్నారు. కోర్టుల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు వింత పోక‌డ‌లు పోయే ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ను గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు నిరాక‌రించినా ఇంకా బుద్ది రాలేద‌న్నారు. త‌న వైఖ‌రి మార్చుకోని కార‌ణంగా రాబోయే ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోయే పరిస్థితి వుంద‌న్నారు. పులివెందుల‌లో వాస్త‌వ ప‌రిస్థితి ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అర్థం కావ‌టం లేద‌న్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌లో వైసిపి డిపాజిట్లు కోల్పోయింద‌న్నారు.

Loading