జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ వేస్తా : మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంకన్న

Spread the love

జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ వేస్తా : మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంకన్న
ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం
పులి వెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై మండిపాడు
ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ కి దేవుడు రాసిన నిజ‌మైన స్క్రిప్ట్ ఇదే
2020 లో నాంప‌ల్లి కోర్ట్ కి సీఎంగా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా హాజ‌రు
కోర్టుకు హాజ‌రైందుకు ఊరేగింపుగా వెళ్ల‌టం సిగ్గుచేటు
కోర్టు హాజ‌రుకాకుండా వుండేందుకు స‌రికొత్త ప‌న్నాగాలు

విజ‌య‌వాడ : న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా కోర్టు హాజ‌రు కాకుండా ప‌న్నాగాలు ప‌న్నిల పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ న్యాయ‌నిపుణుల స‌ల‌హా తీసుకుని పిటిష‌న్ వేస్తానని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న తెలిపారు.

ఆరేళ్ల త‌ర్వాత నాంప‌ల్లి సిబిఐ కోర్ట్ కు హాజ‌రైందుకు ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఊరేగింపుగా వెళ్లిన ఉదంతాన్ని ఖండిస్తూ బుద్దా వెంక‌న్న గురునాన‌క్ కాల‌నీలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో గురువారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా బుద్దా వెంక‌న్న మాట్లాడుతూ దేవుడు స్క్రిప్ట్ రాశాడంటూ త‌రుచూ అనే ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆ భ‌గ‌వంతుడు నిజ‌మైన స్క్రిప్ట్ ఈ రోజు రాశాడ‌న్నారు. 2020 లో సీఎం గా నాంపల్లి కోర్టులో హాజరైన జ‌గ‌న్ ఆరేళ్ల త‌ర్వాత పులివెందుల ఎమ్మెల్యే గా హాజరు కావడమే నిజమైన స్క్రిప్ట్ అన్నారు.

ల‌క్ష‌ల కోట్లు దోచుకుని 11 ఈడీ కేసులు ఉన్న జగన్ ముద్దాయిగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేముందన్నారు. కోర్టుకు స‌మ‌య‌మిచ్చేలా ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షెడ్యూల్ విడుద‌ల చేయ‌టం చూస్తే…న్యాయ‌వ్య‌వ‌స్థ పై ఎంత గౌర‌వం వుందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. న్యాయ‌మూర్తి చెప్పిన‌ట్లు నిందితుడైన ఎమ్మెల్యే జ‌గ‌న్ నడుచుకోవాలా? కోర్టు హాజ‌రయ్యే విష‌యంలో ఈ స‌మయానికి హాజ‌రు అవుతాన‌ని షెడ్యూల్ ఇచ్చే అధికారం ఈడీ కేసుల్లో నిందితుడైన ఎమ్మెల్యే జ‌గ‌న్ కి ఎక్క‌డ వుందంటూ ప్ర‌శ్నించారు.

కోర్టుకు వాయిదా వెళితే.. న్యాయమూర్తి పిలిచే వరకు సాయంత్రం అయినా వేచి ఉండాల్సిన ప‌రిస్థితి వుంటుంద‌న్నారు. కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన జ‌గ‌న్ ఊరేగింపు అంటూ హ‌డావుడి చేయ‌టం ఎందుకంటూ ప్ర‌శ్నించారు. మందీ మార్భలంతో హంగామా చేస్తే.. మళ్లీ వాయిదాకు హాజరు కాకుండా వుండేందుకు ఎమ్మెల్యే జ‌గ‌న్ అండ్ దొంగాల ముఠా ప‌న్నిన ప‌న్నాగం అన్నారు.

కోర్టు అన్న కూడా లెక్కచేయకుండా జగన్ వ్యవహరిస్తున్నాడని, ఎమ్మెల్యే జగన్ లాంటి అవినీతి పరుడు స‌మాజంలో బ‌య‌ట వుండ‌కూద‌న్నారు. చేసిన తప్పులను ఒప్పుకుని చట్టప్రకారం జగన్ జైలుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కోర్టుకు ఒక్క‌డే వెళ్లాల్సి వున్నా దారి పోడువునా పెయిడ్ బ్యాచ్ తో రెచ్చ‌గొట్టేలా ర‌ప్పా ర‌ప్పా అంటూ నినాదాలు చేయించార‌ని, రప్పా రప్పా అని ప్రజలను భయ పెట్టిన విధంగా… కోర్టులను కూడా భయ పెట్టాలని చూస్తున్నాని తెలిపారు. జగన్ కోసం స్వచ్చందంగా జనాలు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. ముందే నాయకులతో మాట్లాడుకుని… రోడ్లు మీదకు జ‌నాల‌ను డ‌బ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నార‌న్నారు.

అక్ర‌మ కేసు లో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అర్ధరాత్రి లక్షల మంది రోడ్లమీదకు వచ్చారని, ఆయన విజయవాడ చేరుకోవడానికి 36 గంటలు పట్టిందన్నారు. కానీ ఎమ్మెల్యే జగన్ కోసం అలా అభిమానంతో వచ్చేవారు లేరంటూ ఎద్దేవా చేశారు. .

ఎమ్మెల్యే జ‌గ‌న్ త‌న కోర్టు హాజ‌రతై శాంతి భద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని , కోర్టు హాజ‌రు కాకుండా త‌ప్పించుకునేందుకు తాడేప‌ల్లి ప్యాలెస్ ప‌థ‌క‌ర‌చ‌న చేశాడ‌న్నారు. హైద‌రాబాద్ లో వై.సి.పికి కార్య‌క‌ర్త‌లు లేరని వారంతా పెయిడ్ బ్యాచ్ అంటూ స్ప‌ష్టం చేశారు. త‌ను కోర్టు వ‌స్తే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని తెలియ‌జెప్ప‌టానికి ఎమ్మెల్యే జ‌గ‌న్ ఇలాంటి డ్రామాలు ఆడించాడ‌ని మండిప‌డ్డారు. కోర్టు ను త‌ప్పుదోవ ప‌ట్టించడానికే ఎమ్మెల్యే జ‌గ‌న్ పెయిడ్ బ్యాచ్ ను రంగంలోకి దించాడ‌న్నారు. త‌ను కోర్ట్ కి వ‌స్తే ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అవుతుంద‌ని చెప్పిన ఎమ్మెల్యే జ‌గ‌న్ , స్పెష‌ల్ ప్లైట్ లో ఎందుకు వ‌చ్చాడో స‌మాధానం చెప్పాల‌న్నారు.

ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురిచేసిన జగన్.. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా జనాలను భయ పెట్టాలని చూస్తున్నాడన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు కష్టపడి ఎపీకి పెట్టుబడులు తీసుకు వస్తుంటే… చూసి ఓర్వలేక పోతున్నాడని మండిప‌డ్డారు.

Loading