న్యూ జీజీహెచ్ లో వున్న స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం..

Spread the love

న్యూ జీజీహెచ్ లో వున్న స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం..
ప్రతి నెల జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకుని హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తాం
సూపరింటెండెంట్ ఎ .వెంకటేశ్వరరావు, ప‌లు విభాగాల హెచ్.వో.డిల‌తో స‌మీక్ష‌ స‌మావేశం
న‌ర్సింగ్ విద్యార్థులను కొత్త భ‌వ‌నం పూర్తికాగానే అందులోకి త‌ర‌లిస్తాం
న్యూ జీజీహెచ్ లో ప‌లు విభాగాలు ప‌రిశీలించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్
రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులపై ఆరా. 

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ కొత్త ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలోని నెల‌కొని వున్న స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల దృష్టికి తీసుకువెళ్లి, ఆ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం. ప్రజ‌ల‌కు మ‌రింత‌గా మెరుగైన వైద్య సేవ‌లు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తామ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

విజ‌య‌వాడ న్యూ జీజీహెచ్ లోని వ‌స‌తులు, సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్యం విధానం తెలుసుకునేందుకు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ గురువారం న్యూజీజీహెచ్ లోని ప‌లు విభాగాల‌ను ప‌రిశీలించి, సూపరింటెండెంట్ ఎ .వెంకటేశ్వరరావు, ప‌లు విభాగాల హెచ్.వో.డిల‌తో స‌మీక్ష‌ స‌మావేశం నిర్వ‌హించారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ సూప‌రింటెండెంట్ స్వాగ‌తం ప‌లికారు.

ఇక స‌మీక్షా స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు డాక్ట‌ర్లు, హెచ్.వో.డి ఆసుప‌త్రికి కావాల్సిన అత్యాధునిక వైద్య ప‌రికారాల గురించి వివ‌రించారు. అలాగే ఆసుప‌త్రి ఆసుప‌త్రి అభివృద్ది, నూత‌న భ‌వ‌న నిర్మాణం, రోగుల‌కు మెరుగైన వ‌స‌తుల‌పై కూడా చ‌ర్చించారు. త‌నని క‌లిసిన న‌ర్సింగ్ విద్యార్ధుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

అనంత‌రం సూపరింటెండెంట్ ఎ .వెంకటేశ్వరరావు , ఇత‌ర వైద్యాధికారుల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆసుప‌త్రిలోని క్యాజువ‌ల్టీ వార్డ్, ఎమ‌ర్జెన్సీ వార్డ్ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. స్వ‌యంగా రోగుల‌తో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవ‌ల‌, ఆసుప‌త్రిలో వున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు, చికిత్స పొందుతున్న పేషంట్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూపరింటెండెంట్ కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సూచించారు. ఆసుప‌త్రికి అభివృద్దికి సంబంధించిన నివేదిక త‌యారు చేసి ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కోరారు.

అనంత‌రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ మీడియా మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి అభివృద్ది, మౌళిక వ‌స‌తుల క‌ల్పనకి సంబంధించి ఆసుప‌త్రిలోని ప‌రిస్థితుల‌పై అవగాహ‌న పెంచుకునేందుకు రావ‌టం జ‌రిగింద‌న్నారు. రోజుకి మూడు వేల మంది అవుట్ పేషంట్ కి ఇక్క‌డ వైద్య సేవ‌లు అందించ‌టం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తి నిత్యం వేలాది మంది పేషంట్స్ కోసం ఆసుప్ర‌తిలో క‌ల్పించాల్సిన వ‌స‌తులు, చేయాల్సిన అభివృద్ది పై స‌మీక్షా స‌మావేశంలో చ‌ర్చించ‌టం జ‌రిగింద‌న్నారు.ఆసుప‌త్రిలోని స‌మ‌స్య‌ల‌ను ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్, వైద్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లి..ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో డాక్ట‌ర్స్ క్రిటిక‌ల్ స‌ర్జరీలు కూడా చేసి ప్ర‌జ‌ల అభినంద‌న‌లు పొందుతున్నారు. ఇంకా ఈ ఆసుప‌త్రికి అత్యాధునిక మెడిక‌ల్ ఎక్విప్ మెంట్ అవ‌స‌రం తో పాటు క్యాన్స‌ర్ కి సంబంధించిన ఆధునాత‌న ప‌రికారాలు ఏర్పాటు చేయాల్సి వుంద‌న్నారు. ఈ ప్ర‌భుత్వాసుప‌త్రి అభివృద్దికి సంబంధించి ప్ర‌తి నెల జిల్లా ఎమ్మెల్యేల‌తో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆసుప‌త్రి అభివృధ్ది ప‌నులు వేగంగా జ‌రిగేందుకు చ‌ర్య‌ల‌తో పాటు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటామ‌న్నారు. రాబోయే రోజుల్లో జీజీహెచ్ లో అన్ని వ‌స‌తులు స‌మ‌కూరుస్తామ‌న్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రి అభివృద్దికి సంబంధించి సీ.ఎస్.ఆర్ ఫండ్స్ తీసుకువ‌చ్చే విధంగా కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక్క‌డ న‌ర్సింగ్ చ‌దివే విద్యార్ధుల స‌మ‌స్య త‌న దృష్టికి వ‌చ్చింద‌ని కొత్త భ‌వ‌నం నిర్మాణం ప‌నులు వేగవంతంగా పూర్తి చేసి….నిర్మాణం పూర్తి కాగానే విద్యార్ధుల‌ను ఆ భ‌వ‌నంలోకి త‌ర‌లిస్తామ‌న్నారు.
కొత్త భవనం నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు జిల్లా వైద్య అధికారులు, జిల్లా ఎమ్మెల్యేల‌తో క‌లిసి కృషి చేస్తామ‌న్నారు.

చికిత్స పొందుతున్న‌ కెమెరామెన్ ను ప‌రామ‌ర్శించిన ఎంపీ

ఎ.బి.ఎన్ చానెల్ కెమెరా మేన్ ఉమామహేశ్వ‌ర‌రావు స‌తీస‌మేతం గురువారం ఆల‌యానికి వెళ్లే స‌మ‌యంలో బైక్ స్కిడ్ కావ‌టం తో తీవ్ర గాయాల‌పాలై ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలిసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ గాయ‌ల‌పాలైన కెమెరా మెన్ ఉమామ‌హేశ్వ‌ర‌రావు దంప‌తుల‌ను ప‌రామ‌ర్శించారు. వైద్యుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిపాల్ వై. ఏడు కొండులు, వివిధ‌ విభాగ హెచ్.వో.డి డాక్ట‌ర్స్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ & అదర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘు రామరాజు , ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.టి.యు.సి ఎన్టీఆర్ జిల్లా ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి యాద‌వ్ ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు.

Loading