ఈశ్వ‌రుడి ఆశీస్సులు రాష్ట్రాభివృద్ధిపై, ప్ర‌జ‌ల‌పై వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్

Spread the love

ఈశ్వ‌రుడి ఆశీస్సులు రాష్ట్రాభివృద్ధిపై, ప్ర‌జ‌ల‌పై వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్
పెద‌కాకాని శివాల‌యంలో స‌తీస‌మేతంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌త్యేక పూజ‌లు

పెద‌కాకాని : రాష్ట్రాభివృద్దిపై, ప్ర‌జ‌లంద‌రిపై ఆ శివ-పార్వ‌తుల ఆశీస్సులు వుండాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కోరుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా పెద‌కాకాని లోని శ్రీ గంగా భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని సోమ‌వారం స‌తీస‌మేతంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్, జాన‌కి ల‌క్ష్మీ దంప‌తుల‌కు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో ఆల‌య అధికారులు, వేద పండితులు స్వాగ‌తం ప‌లికారు. కార్తీక సోమ‌వారం కావ‌టంతో భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లేశ్వ‌ర స్వామి వారికి అభిషేకం చేయించారు. అలాగే ఆల‌య ప్రాంగ‌ణంలో దీపారాధ‌న చేశారు. అనంత‌రం వేద పండితులు ఆశీర్వ‌చ‌నం అందించి తీర్ధ‌ప్ర‌సాదాలు అందించ‌గా, ఆల‌య ఈవో గోగినేని లీలాకుమార్ స్వామివారి చిత్ర ప‌టాన్ని బ‌హుక‌రించారు.

Loading