పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి.

Spread the love

విజయవాడ 10/11/2025

పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి.

  • ఫిర్యాదుల ఆడిట్ ను జిల్లా అధికారులు నిక్కచ్చిగా జరపాలి.
  • కీలక ప్రగతి సూచికలు, నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి.
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ *

పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలని, మరింత మెరుగైన, సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియ తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ మాట్లాడుతూ… అర్జీల పరిష్కారంలో విధానపరమైన లోపాలు (ప్రొసీజర్ లాప్సెస్) లేకుండా చూడాలని చెప్పారు. అర్జీల పరిష్కారం సరిగా నిర్వహించని అధికారులపై చర్యలకు వెనుకాడబోనన్నారు. ఫిర్యాదుల ఆడిటింగ్ ను నిక్కచ్చిగా చేయాలని చెప్పారు. కీలక ప్రగతి సూచికల(కే పి ఐ), నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని చెప్పారు.

పి జి ఆర్ ఎస్ కు మొత్తం 155 అర్జీలు

సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు మొత్తం 155 అర్జీలు అందాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖ అర్జీలు 51 ఉన్నాయి. పోలీస్ శాఖ కు 23 , పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు 20, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలకు 8, డిఆర్డిఏకు 6, దేవదాయ శాఖకు 5, విద్య, గృహ నిర్మాణం, జలవనరులు, సర్వే శాఖలకు 4 చొప్పున, విభిన్న ప్రతిభవంతుల సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు 3 చొప్పున అర్జీలు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీ నరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Loading