Home Political news విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేపించిన MLA బొండా...

విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేపించిన MLA బొండా ఉమ

2
0

 18-5-2025

విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేపించిన MLA బొండా ఉమ

విజయ్ కృష్ణ సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకుని రావాలని నూతన కమిటీ కి ఆదేశించిన బొండా ఉమ

నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అన్ని రకాల ప్రజా అవసరాలు తీర్చే ఏకైక సూపర్ బజార్ విజయ్ కృష్ణ సూపర్ బజార్

ధి:-18-5-2025 ఆదివారం ఉదయం 11:00″గం లకు ” బందర్ రోడ్డు లోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలకమండలితో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవం సూపర్ బజార్ పైన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దీపావళి పండుగ సమయంలో టపాసులు, పక్షులు అన్ని కూడా ఇచ్చట నాణ్యతతో కూడిన సరసమైన ధరలకు అందించడం విజయ్ కృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత అని సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు

D మార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, మెట్రోలాంటి కార్పొరేట్ సంస్థలు రాకముందు విజయ్ కృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్తు జిల్లాలోని ప్రజల అందరి అవసరాలు తీర్చేటువంటి విధంగా ఆనాడు ముందుకు సాగుతూ ఉండేదని తర్వాత కాలంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం అశ్రద్ధ వహించడంతో కొంతమేరకు వెనకబడింది అనేది వాస్తవం అని

 ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన ఈ పాలకమండలి మంచి లాభాలను చేకూర్చేటువంటి విధముగా విజయ్ కృష్ణ సూపర్ బజార్ ను ముందుకు తీసుకొని వెళతారని అన్ని రకాలైనటువంటి నిత్యవసర సరుకులతో పాటు, కాస్మోటిక్, డ్రై ఫ్రూట్స్, మాంసాహారాలు, పూల బొకేలు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటు ధరల్లో తీసుకొని వస్తూ కార్పొరేట్ సంస్థల షాపింగ్ కాంప్లెక్స్ కన్నా మిన్నగా ఈ విజయ్ కృష్ణ సూపర్ బజార్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు చేరువలోకి తీసుకొని రావాలని ఆ దిశగా మంచి నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను అమలుపరిస్తే దీనికి ప్రభుత్వం నుండి కోపరేటివ్ సొసైటీ నుండి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి ఈ పాలక మండలికి పుష్పగుచ్చాలు శాలువాలతో అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు

తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుండి 2019 వరకు ఈ విజయ్ కృష్ణ సూపర్ బజార్ సంస్థ ప్రజలకు అవసరమైన సరుకులతో అవసరాలు తీర్చేటువంటి విధంగా ఉండేది అని గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేయడం ఆనాడు ఉన్న పాలకమండలి సరైనటువంటి నిర్ణయాలు చేయకపోవడంతో ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ షాపింగ్ కాంప్లెక్స్ లకి పోటీలు ఎదుర్కోలేక కొంత వెనుకబడింది, ఈ సంస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ఈ సూపర్ బజార్ గత వైభవాన్ని తీసుకొని వచ్చేటువంటి విధముగా ఇప్పుడు పాలకమండలిగా ప్రమాణస్వీకారం చేసిన ఈ నూతన కమిటీ ముందుకు తీసుకుని పోతే ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని నూతన కమిటీకి తన ఆశీస్సులను అందజేశారు

నూతన కమిటీని సూపర్ బజార్ ఎండి కిరణ్ కుమార్, MLA లు బోండా ఉమామహేశ్వరావు గద్దె రామ్మోహన్ రావు సమక్షంలో ప్రమాణ పత్రాలతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించడం జరిగింది, సూపర్ బజార్ చైర్మన్ గా వెలగా సురేష్ బాబు, పాలకమండలి సభ్యులుగా మోతుకూరి కాసిం, పడమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, బేవర సూరి, కడియం శివప్రకాష్, వేల్పుల రాజేష్ లు ప్రమాణ స్వీకారోత్సవం చేయగా

ఈ ప్రమాణ స్వీకారోత్సవ సభకు అధ్యక్షులుగా నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్రావు, మోదుగుల తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here