కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

6
0

 కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి 

విజయనగరం మండలంలో ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్ పడిన సంఘటనలో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు.అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేసారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here