విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేక ఆహారం పెట్టు ప్రదేశాల ఏర్పాటు

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేక ఆహారం పెట్టు ప్రదేశాల ఏర్పాటు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేక ఆహారం పెట్టు ప్రదేశాల ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగర పరిధిలోని వివిధ ప్రాంతాలలో వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఆహారం పెట్టు ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి కేవలం కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం పెట్టవలెనని నగర ప్రజలను కోరారు.

నగరంలోని వీధి కుక్కలను ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్లలో యాంటీ బర్త్ కంట్రోల్ నిర్వహిస్తూ ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్లు చేస్తూ వీధి కుక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా నగర ప్రజలకు వీధి కుక్కలు దాడి చేయకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రస్తుతం నగర పరిధిలోని 61 ప్రాంతాలలో వీధికుక్కల కోసం ఆహారం పెట్టు ప్రదేశాలను గుర్తించి ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేశామని, రానున్న కాలంలో మరిన్ని పెంచనున్నామని తెలిపారు. నగర ప్రజలు కూడా దీనికి సహకరించి కేవలం వీధి కుక్కలకు ఆహారం పెట్టు ప్రదేశాలలోనే ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Loading