బోళాశంక‌రుడి అనుగ్ర‌హం ప్ర‌జ‌లందరిపై వుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)సిద్దార్ధ హోట‌ల్ మేనేజ్మమెంట్ కాలేజీ గ్రౌండ్ లో కార్తీక దీపోత్స‌వంముఖ్యఅతిథులుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజ‌రు

Spread the love

బోళాశంక‌రుడి అనుగ్ర‌హం ప్ర‌జ‌లందరిపై వుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
సిద్దార్ధ హోట‌ల్ మేనేజ్మమెంట్ కాలేజీ గ్రౌండ్ లో కార్తీక దీపోత్స‌వం
ముఖ్యఅతిథులుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజ‌రు

విజ‌య‌వాడ : ఆ ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం ప్ర‌జ‌లంద‌రిపై వుండి సుఖ‌సంతోషాల‌తో వుండాలని ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్రార్ధించించారు. ఈటీవీ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురం పిన్న‌మ‌నేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోట‌ల్ మేనేజ్మెంట్ క‌ళాశాల మైదానం లో శ‌నివారం సాయంత్రం కార్తీక దీపోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజరైన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ , రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, రాష్ట్ర గనులు, భూగ‌ర్భ వ‌న‌రులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌,ప్ర‌భుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ , ప్ర‌భుత్వ విఫ్, ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ‌, కార్పొరేట‌ర్ చెన్నుపాటి ఉషారాణి , జెడ్పీటీసీ మాజీ చైర్ ప‌ర్స‌న్ గ‌ద్దె అనురాధ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. అనంతరం ఆ ప‌ర‌మ‌శివుడి పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొని, వేద‌పండితుల ఆశీర్వ‌చ‌నం అందుకున్నారు.

ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ కార్తీక దీపోత్స‌వానికి రావ‌టం చాలా ఆనందం గా వుందన్నారు.. విజ‌య‌వాడ న‌గ‌రం అంతా ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుందని పేర్కొన్నారు. కార్తీక దీపాల వెలుగులో విజ‌య‌వాడ న‌గ‌రం దేదీప్య‌మానంగా మెరిస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల్లో భ‌క్తితో పాటు , ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు ఇలాంటి కార్య‌క్ర‌మాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు. కార్తీక దీపోత్స‌వం కార్య‌క్ర‌మం చేప‌ట్టిన ఈటీవీ యాజ‌మాన్యాన్ని అభినందించారు.

Loading