కార్తీక పౌర్ణమి నేపధ్యంలో దేవాలయాలు మరియు ఘాట్ల వద్ద పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.

పత్రికా ప్రకటన. తేదీ.05.11.2025.

కార్తీక పౌర్ణమి నేపధ్యంలో దేవాలయాలు మరియు ఘాట్ల వద్ద పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు

కార్తీక పౌర్ణమి నేపధ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుండే నదిలో స్నానాలు చేసి పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయాలలో ధర్శనం చేసుకుంటారని ఈ క్రమంలో దేవాలయాలలో మరియు ఘాట్ల వద్ద భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో ప్రణాళికాబద్దంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ నేపధ్యంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ పరిదిలోని ది.04.11.2025 తేదీ అర్ధరాత్రి నుండే  అన్నీ పోలీసు స్టేషన్ల ఏరియాలలోని అన్నీ టెంపుల్స్ మరియు ఘాట్స్ వద్ద పోలీసు అధికారులు వారి సిబ్బందితోటి బెల్‌హెల్లర్స్ ద్వారా భక్తులకు సూచనలు అందిస్తూ, రద్దీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ భక్తులు దీపాలు వెలిగిస్తూ, పూజలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బంధోబస్త్ నిర్వహించడం జరిగింది.  అవసరమైన ప్రదేశాలలో సి.సి.కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా మరియు డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల రాద్ధీని పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేస్తూ భక్తులు శాంతియుత వాతావరణంలో దర్శనాలు పూర్తి చేసుకునేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.

Loading