నారా భువనేశ్వరి సేవలు మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం

Spread the love

నారా భువనేశ్వరి సేవలు మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం

‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ‘2025 అవార్డు అందుకోవడం పై
ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం.

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కి ప్రతిష్టాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును అందుకోవడం పై మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
( సుజనా చౌదరి) హర్షం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక ,సాధికారత రంగాలలో చేసిన విశేష కృషిగాను లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రతిష్టాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారం అందుకోవడం
పై ఎమ్మెల్యే సుజనా చౌదరి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం విశేష కృషి చేస్తున్న నారా భువనేశ్వరి సేవలు వెలకట్టలేనివన్నారు

రెండు పురస్కారాలు అందుకొని నారా భువనేశ్వరి తెలుగు మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే సుజనా కొనియాడారు. ట్విట్టర్ వేదికగా నారా భువనేశ్వరి కి శుభాకాంక్షలు తెలిపారు.

Loading