
పశ్చిమ అభివృద్ధికి పెద్దపీట
అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి..
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా 34,35 డివిజన్ల లో కేదారేశ్వరపేట, మ్యాంగో మార్కెట్, సీ కే రెడ్డి రోడ్, ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు
రూ 87 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీ టీ రోడ్ల అభివృద్ధి పనులకు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు,34,35 డివిజన్ల కార్పొరేటర్లు బండి పుణ్యశీల, బలసాని మణెమ్మ మరియు కూటమి నేతలతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు..
అదేవిధంగా 39 వ డివిజన్ క్వారీ వీధి, కే సీ పబ్లిక్ స్కూల్ రోడ్, కే వి ఆర్ బిల్డింగ్ వీధి, ఆర్ కే పబ్లిక్ స్కూల్ వరకు రూ 48 లక్షల వ్యయంతో రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్ పేవర్ బాక్సుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా స్తానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ,కూటమి నేతలతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ
బీ టీ రోడ్డు రహదారి పనులు ,పేవర్ బాక్సుల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా సంబంధిత అధికారులను ఆదేశించారు.
పశ్చిమ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి డివిజన్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు.
ప్రజల సమస్యలను స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి ఎన్డీఏ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారి పేవర్ బాక్సుల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా సంబంధిత అధికారులను ఆదేశించారు..
ఈ కార్యక్రమంలో ఈ ఈ శ్రీనివాస్ ,
డీ ఈ లు పురుషోత్తం, మాధవి, ఏ ఈ లు జాస్మిన్, టీ రాజేష్ కూటమి నేతలు అడ్డూరి కొండలరావు, రుద్రపాటి వెంకటేష్, ఆకుల రవిశంకర్, బొడ్డు నాగలక్ష్మి, నున్న కృష్ణ,భూదాల నందకుమారి , మాజీ కార్పొరేటర్లు సుభాషిణి, గుండారపు హరిబాబు , కే శివ శర్మ, పచ్చిపులుసు శివప్రసాద్, ఏలూరి సాయి శరత్,లింగాల అనిల్, నక్కెట్ల రాజా, గోవర్ధన్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు లక్ష్మీ ప్రసన్న, లలిత, నర్మదా తదితరులు పాల్గొన్నారు..
![]()
