
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
ది.31.10.2025
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసుల ఆద్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా సమైక్యతా రన్..
దేశ సమైక్యతను మరియు సమగ్రతను చాటిచెప్పిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, దేశ ఐక్యతా వాది మరియు భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదినాన్ని పురస్కరించుకుని ది.31.10.2025వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. అధ్యక్షతన ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుండి బందర్ రోడ్డు మీదుగా డి.అడ్రస్స్ మాల్ వరకు సమైక్యతా రన్ నిర్వహించడం జరిగింది.
ఈ సంధర్భంగా నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ..... ఈ రోజు భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నీ రాజకీయ పక్షాలు, ఎన్.జి.ఓ.లు, వివిద సంఘాల వారు కావచ్చు ఈ రోజు యూనిటీ ర్యాలీలను జరుపుకునున్నారు, రన్ ఫర్ యూనిటీ అని, యూనిటీ వాక్తాన్ అని వివిధ కార్యక్రమాలను నిర్వహించి వారి యొక్క సేవలను స్మరించుకోవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిటీష్ వారిని పారదోలిన అనంతరం భారత దేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా 500 పై చిలుకు ఉన్న సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడంలో వారి కృషి ఎనలేనిది. వారి సేవలకు ఈ రోజు మనం స్వేచ్చను అనుభవిస్తున్నాము. వారి సేవలను గుర్తు చేసుకుంటూ భారత దేశ సమైక్యత సార్వబౌమాధికారం, ఐక్యత ఎన్నో బాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా బిన్నత్వంలో ఏకత్వం సాదించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఈ సమైక్యతా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. కె.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి ఐ.పి.ఎస్. ఎస్.వి.డి.ప్రసద్ , ఎ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు, ఎస్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు మరియు కళాశాల విధ్యార్ధినీ విధ్యార్ధులు పాల్గొన్నారు.
![]()
