
రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయకత్వం దేవుడు ఇచ్చిన వరం
సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే మోంథా తుఫాన్ బారిన పడకుండా పెద్ద నష్టాన్ని ఆపగలిగాం
రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం దేవుడు ఇచ్చిన వరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, ముందుచూపు వల్లే మోంథా తుఫాన్ బారిన పడకుండా పెద్ద నష్టాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు. ముందుగానే అన్ని విభాగాలను అప్రమత్తం చేయడం, సమన్వయ చర్యలు చేపట్టడం వల్లే ప్రజల ప్రాణాలు కాపాడబడ్డాయని తెలిపారు. ప్రజల ప్రాణాలు కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఈ తుఫాన్‌లో దేవుడి దయతో, సీఎం చంద్రబాబు జాగ్రత్తలతో రాష్ట్రం పెద్ద విపత్తు నుండి బయటపడింది అని మంత్రి తెలిపారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భద్రత కోసం పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉండడం దైవానుగ్రహం అని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పంటలకు నష్టం కలగకుండా తక్షణ సాయంతో ముందుకు వస్తామని మంత్రి వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, రవాణా, పంట నష్టాల పునరుద్ధరణపై అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ప్రభుత్వం రైతు కోసం, ప్రజల కోసం ఉందనే నమ్మకం ప్రజల హృదయాల్లో నిలవాలి. దేవుడి దయ, ప్రభుత్వ దృఢ సంకల్పం కలిస్తే ఏ విపత్తునైనా తట్టుకోగలం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![]()
