
విజయవాడ నగరపాలక సంస్థ
28-10-2025
బుడమేరులో ఉన్న వ్యర్ధాలను తొలగించండి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
బుడమేరులో ఉన్న గుర్రెపుడెక్కులను, వ్యర్థాలను తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, బుడమేరు, డాబా కొట్లు, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుడుమేరు కాలువలోని వ్యర్ధాలను తొలగించాలని, నగరంలో డీసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని, నీరు ప్రవాహానికి ఏమాత్రం ఆటంకం లేకుండా వ్యర్ధాలను తొలగించేటట్టు అధికారులు పరివేక్షిస్తుండాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎంకే బిగ్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వాడుకనీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పడుకునేందుకు సౌకర్యాలు, భోజన సదుపాయం వంటి అంశాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి అయోధ్య నగర్ లో గల అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో బయాలజీ కామేశ్వరరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
![]()
