ప్రజలందరికీ జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలి : యార్లగడ్డ

Spread the love

ప్రజలందరికీ జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలి : యార్లగడ్డ

గన్నవరం నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లోనూ ఈ దీపావళి పండుగ కొత్త వెలుగుల నింపాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు. గన్నవరం నియోజవర్గ టిడిపి, జనసేన,బిజెపి, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయులకు యార్లగడ్డ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్వకాలంలో ప్రజలను పట్టిపీడిస్తున్న నరకాసురుని శ్రీకృష్ణుడు సత్యభామ వధించి అ రాక్షసుడి పీడ నుంచి ప్రజల్ని విముక్తి కలిగించారని అప్పటినుంచి నరకాసురుని వధించిన రోజును చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రజలు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చి పండుగ చేసుకుంటారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన సాగుతుందని కూటమి పాలనలో అభివృద్ధి కాంతిరేఖలు రాష్ట్రంలోని నలుమూలలకు విస్తరిస్తున్నాయని యార్లగడ్డ పేర్కొన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో మన రాష్ట్రం ఐటి కి చిరునామాగా మారనుందని తద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఈ దీపావళి అందరి జీవితాల్లోనూ కొత్త కాంతులు నింపాలని భగవంతుని కోరుతున్నట్లు యార్లగడ్డ తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *