రాష్ట్ర ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Spread the love

రాష్ట్ర ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగు మాత్రమే కాదు, ఆశ, అభివృద్ధి, సంక్షేమం కూడా తీసుకురావాలి. మన రాష్ట్రం మరోసారి వెలుగులా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి ధ్యేయమని, ప్రతి నిర్ణయం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు చూపుతున్న నాయకత్వం వల్ల రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. సాంకేతికత, విద్య, వ్యవసాయం, పరిశ్రమ, ప్రతి రంగంలో ఆవిష్కరణలతో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు లభిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల విశ్వాసం కూటమి ప్రభుత్వానికి బలమని, ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలిగేలా ఆర్థికాభివృద్ధి, అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులా మారాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *