సీఎం చంద్రబాబు తో దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

Spread the love

సీఎం చంద్రబాబు తో దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ప్రజల కలలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం.

ఎన్టీఆర్ జిల్లా, భవానిపురం, 19/10/2025.

విజయవాడ భవానిపురం పున్నమి ఘాట్ ఏర్పాటు చేసిన దీపావళి సంబరాల కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలను ప్రారంభించి, భువనేశ్వరి చిన్నారులతో కలిసి తిలకించారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటుతో ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కూటమి ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తుంది. విస్తృత ప్రచారంతో ప్రతి ఒక్కరికీ జీఎస్టీపై అవగాహన కలిగిందన్నారు.

తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, వారి సతీమణి భువనేశ్వరి కి మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర జీఎస్టి ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *