
విజయవాడ నగరపాలక సంస్థ 14-10-2025 డ్రోన్ ద్వారా ఔట్ ఫాల్ డ్రైన్ పరిశీలన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యాటన లో భాగంగా అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్, జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం ఇళ్ళు, ఎక్స్ఎల్ ప్లాంట్, వాంబే కాలనీ, డిస్నీ ల్యాండ్ రోడ్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ, ఔట్ ఫాల్ డ్రైన్ లు పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద ఉన్న ఔట్ ఫాల్ డ్రైన్ ను స్వయంగా తానే డ్రోన్ ద్వారా డ్రైన్ లో ప్రవాహాన్ని, అందులో ఉండే వ్యర్ధాలను గమనించి, డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు ఉండరాదని, అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. జే ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించి, అక్కడున్న చెట్ల వ్యర్ధాలను, పెరిగిపోయిన తీగలను తొలగించి, పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ లోని అన్న క్యాంటీన్ ను పరిశీలించారు అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు సమయానికి అన్న క్యాంటీన్ తెరుస్తున్నారా లేదా, ఆహారంలోని నాణ్యత, త్రాగునీటి సౌకర్యాలు తదితర అంశాల పై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఇన్చార్జ్ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్ ) శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
![]()
