కనకదుర్గమ్మను దర్శించుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్

Spread the love

విజయవాడ, తేదీ: 13.10. 2025 కనకదుర్గమ్మను దర్శించుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి చేరుకున్న సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ కు వేద పండితులు పూర్థ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద మంత్రోచ్ఛారణలతో అంతరాలయానికి తోడుకుని వెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పూజారులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్ధప్రసాదాలు, చిత్రపటాన్ని సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ కు అందించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *