ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈ నెల 11 వ తేదీన శనివారం, కేదారేశ్వరపేట , విఎంసి కళ్యాణమండపంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అను మై బేబీ హాస్పిటల్స్, ఆంధ్ర హాస్పిటల్స్, బెస్ట్ హాస్పిటల్స్ వారి సహకారంతో కేదారేశ్వరపేటలోని విఎంసి కళ్యాణమండపంలో శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు
ఈ శిబిరం లో స్త్రీల ఆరోగ్య సమస్యలు అర్డోపెడిక్, డెంటల్, కంటి ,జనరల్ ఫిజీషియన్, గుండె,శ్వాసకోశ సంబంధిత సమస్యలకు నిష్ణాతులైన వైద్యులు ఉచితంగా సేవలందిస్తారన్నారు
పశ్చిమ ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఒక ప్రకటన లో తెలిపారు.
![]()
