డీఎస్సీ 1998 ఉపాధ్యాయులని రెగ్యులైజేషన్ చేయాలి- బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Spread the love

డీఎస్సీ 1998 ఉపాధ్యాయులని రెగ్యులైజేషన్ చేయాలిబైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

విజయవాడ: డీఎస్సీ 1998 ఉపాధ్యాయులు రెగ్యులైజేషన్ చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు . శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగానే మాకు ప్రయోజనాలు కల్పించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని.25 సం” నుండి నష్టపోయిన మాకు ప్రభుత్వ సర్వీసును క్రమబద్ధీకరణ చేసి 62 సం” లకు సర్వీస్ ని పొడిగించాలని కోరుతున్నాం, పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు 20,000 పెన్షన్ సదుపాయం కల్పించి అన్ని విధాల మా కుటుంబాలను అదుకోవాలని కోరారు. రేపు గాంధీనగర్ ధర్నాచౌక్ లో జరిగే డీఎస్సీ 1998 ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై అవ్వాలని, ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను తెలియజేసి మా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి.కామేష్, అప్పలనాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *