ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డిస్పైసి ఇన్ మల్టీ రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం

Spread the love

ప్రచురణార్థం 05-10-2025

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో రాగానే వ్యాపార రంగానికి పూర్వవైభ‌వం
గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో కుదేలైన వ్యాపార రంగం
ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి
స్పైసి ఇన్ మల్టీ రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం

విజయవాడ: గ‌త వైసిపి ప్ర‌భుత్వం రాష్ట్రంలో వ్యాపార రంగం కుదేలు కావ‌టంతో, వ్యాపార‌స్తులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఎన్డీయే కూట‌మి అధికారంలో నాటి నుంచి వ్యాపార రంగం పుంజుకుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం,హై స్కూల్ రోడ్, ఆర్ ఆర్ గార్డెన్ లో “స్పైసి ఇన్ మల్టీ రెస్టారెంట్ ను ఆదివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రారంభించారు.

అనంతరం జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అర్జున రావుకి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ అర్జున్ రావు తో త‌న‌కి ఎన్నో సంవత్సరాలుగా ప‌రిచ‌యం వుంద‌ని, భ‌విష్య‌త్తులో మరెన్నో బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌ర్ధ‌వంత‌మైన పాల‌న‌లో అభివృద్ది, సంక్షేమం అంద‌టంతో రాష్ట్రంలోనే కాదు, న‌గ‌రంలో కూడా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్నారు. వైబ్రెంట్ సిటీగా విజయవాడ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ కి రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అర్జున రావు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్,దేవినేని అపర్ణ, రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శులు, బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎమ్.ఎస్.బేగ్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్,టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, హరివిల్లు సీ ఎం డి చౌదరి ల‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *