రాజకీయాలకతీతంగా ఆర్ ఎస్ ఎస్ సేవలు, భరతమాత సేవలో,దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యులు కావాలి
ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాలలో ఎమ్మెల్యే సుజనా చౌదరిరాజకీయాలకతీతంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్) సేవలందిస్తుందని సమాజాన్ని బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత అర్ ఎస్ ఎస్ లో భాగస్వామ్యం కావాలని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) పిలుపునిచ్చారురాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, తనాజీ నగర్, విజయవాడ మహానగర్ వారు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా విజయదశమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు . విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో జరిగిన ఈ వేడుకలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం సంతోషకరమన్నారు. భారతీయ సంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణను ఆర్ ఎస్ ఎస్ బోధిస్తోందని కులమతాలకతీతంగా సేవలందిస్తోందన్నారు ,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత రాజకీయాల్లోకి రావాలని సమాజాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భరతమాతకు సేవలు అందించడానికి, భవిష్యత్ తరాలకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి యువత సిద్ధమవ్వాలని ముందుకు రావాలన్నారు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారని మోడీ హయాంలోనే ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. అందరం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముందుకు వెళ్దాం అన్నారు .ఎపి బౌద్ధిక్ ప్రముఖ్ కొండపల్లి రామారావు మాట్లాడుతూ సంఘ సేవలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్రను వివరించారు,విపత్తు సమయంలో ఆర్ ఎస్ ఎస్ నిస్వార్ధంగా సేవలు అందించడం దేశ నిర్మాణంలో సహాయ పడటంవంటి విషయాలను తెలియజేశారు. సనాతన ధర్మం, హిందూ ధర్మం , గురించి వివరిస్తూ సామాన్యులను అసామాన్యులు గా మార్చే శక్తి ఆర్ఎస్ఎస్ కు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగ్ ఏక్ కార్యవాహ సూరిబాబు, తానాజీ నగర్ కార్యవాహ నందన్ సాంబశివరావు, వాలి సుగ్రీవ బస్తీ ప్రముఖ్ జేజి బాబు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్,అవ్వారు బుల్లబ్బాయి, మొండి గోవర్ధన్ , కిరణ్, బీజేపీ నేతలు పోతిన భేసు కంటేశ్వరుడు, పైలా సురేష్,యర్రా రవి, కే దుర్గ ప్రసాద్, బీ ఎస్ కే పట్నాయక్,దేవిన హరిప్రసాద్, బెవర మురళి, రాయన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
![]()
