విజయవాడ పత్రిక ప్రకటన 1/10/2025
దసరా రోజున విఐపి దర్శనాలు లేవు
కృష్ణానది ఉధృతి వల్ల అమ్మవారి తెప్పోత్సవం,జలవిహారం రద్దు.
గురువారం ఉదయం జరిగే పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు పరిసమాప్తం.
దుర్గగుడి ఈవో శీనా నాయక్
అమ్మవారి దర్శనానికి భవాని దీక్ష ధారులు అధికంగా తరలివస్తున్నందున గురువారం విఐపి, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు.
మూలా నక్షత్రం రోజున నిర్వహించిన రీతిలోనే దసరా రోజున కూడాఅన్ని క్యూ లైన్ లలో ఉచిత దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.
కృష్ణానది కి వరద ఉధృతి అధికంగా ఉన్నందున నదిలో అమ్మవారి తెప్పోత్సవం, జలవిహారం ఉండవన్నారు. అయితే శివాలయం నుంచి దుర్గా ఘాట్ వరకు ఊరేగింపుగా వెళ్లి శాస్త్రోక్తం గా జరపాల్సిన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
భక్తుల రద్దీ రీత్యా తెల్లవారుఝామున రెండు గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దసరా రోజున క్యూలైన్లోని భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు.
బుధవారం సాయంత్రానికి 62 లక్షల రూపాయల ఆదాయం
దసరా ఉత్సవాలలో పదవ రోజు బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి పలు రకాల సేవల రూపేణా రూ. 62లక్షల 16వేల 970 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 15 రూపాయల లడ్డులు 12,847 విక్రయించగా 1,92,705 రూపాయలు , వందరూపాయల లడ్డు బాక్స్ లు 54,705 విక్రయించగా రూ.54,70,500 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా ముప్పైఆరు వేలు, ప్రత్యేక పరోక్ష చండిహోమం ద్వారా 24 వేలు, అదేవిధంగా ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 20,464 రూపాయలు ఫోటో& క్యాలెండర్ల విక్రయం ద్వారా 6,170 రూపాయలు, కేశఖండన ద్వారా రూ.4,58,720 ఇతరత్రా 8,411 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి 85,094 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు.
చిన్నారులు తప్పిపోకుండా 5,042 ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 25,533 మందికి అన్న ప్రసాద వితరణ చేశామని, 17,29,057 లడ్డూలను లను విక్రయించినట్లు తెలిపారు.
(విజయవాడ ఇంద్రకీలాద్రి మీడియా కేంద్రం నుంచి జారీ)
![]()
