పేద ప్రజల సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, పేదరికం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి .లక్ష్మీశ అన్నారు.

Spread the love

ఎన్‌టీఆర్‌ జిల్లా
తేదీ: 01.10.2025

             ఎన్‌టీఆర్‌ భరోసాతో పేదలకు సామాజిక భద్రత...             
                     జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ 

పేద ప్రజల సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా  పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, పేదరికం లక్ష్యంగా  ప్రభుత్వం  పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి .లక్ష్మీశ అన్నారు.

ఎన్‌టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ 

విజయవాడ అర్బన్ 14వ వార్డు పుట్టా రోడ్ ప్రాంతంలో అధికారులతో కలిసి లబ్దిదారులకు సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్దిదారులను స్వయంగా కలిసి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియ గురించి అడిగి తెలుగుసుకున్నారు. లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అవకతవకలకు తావులేకుండా అత్యంత పారదర్శకత జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్లవద్దే అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్ల ద్వారా 2,29,874 మంది లబిద్దారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ క్యాటగిరీల పెన్షన్లకు సంబంధించి రూ. 99 కోట్ల 27 లక్షల మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *