పోతిన వెంకట మహేష్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీం పోతిన మహేష్ నాయకులు.

Spread the love

పోతిన వెంకట మహేష్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీం పోతిన మహేష్ నాయకులు.

ముందుగా పోతిన మహేష్ కి పండితుల మరియు పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలు,ఆశీర్వచనం తెలియజేసినారు అనంతరం మైనారిటీలు శాలువా వేసి శుభాకాంక్షలు తెలియజేసినారు

  1. చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ వారి ఆహ్వానం మేరకు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేసినారు.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం అధ్యక్షులు గుడాల శ్రీనివాస్ కార్యదర్శి పిల్ల ఆనంద్ తో సంఘం సభ్యులు పాల్గొని పోతిన వెంకట మహేష్ తో చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం హాల్ నందు కేక్ కట్ చేయించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు.
  3. టీం పోతిన మహేష్ నాయకులు పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మందికి బెడ్షీట్లు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు
  4. టీం పోతిన మహేష్ నాయకులు కుండల మార్కెట్ వద్ద తమ్మిన రవీనా అమ్మవారి ఆలయం వద్ద వందమందికి అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినారు.
  5. సితార సెంటర్ వద్ద పది మొక్కలు టీ మహేష్ నాయకులు నాటినారు
  6. మద్దెల కనకారావు మరియు నియమాల సంజీవరావు ఆధ్వర్యంలో మహేష్ ఇంటి వద్ద కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు
  7. నిన్న రాత్రి ఇంటి వద్ద పశ్చిమ నియోజకవర్గంలోని యువత పెద్ద ఎత్తున మహేష్ జన్మదినాన్ని బాణాసంచా కాల్చి కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోతిన మహేష్ ట్రస్ట్ ఏర్పాటు కోసం మొదటి సంతకం చేయడానికి వెండి పెన్నును బహుకరించినారు.
  8. హరే రామ హరే కృష్ణ సంస్థ వారు ప్రత్యేకంగా ఆశీర్వచనం తెలియజేశారు.
  9. పశ్చిమ నియోజకవర్గం లోని పలు డివిజన్లో నాయకులు యువత మహేష్కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు
  10. సీనియర్ రాజకీయ నాయకులు పోతున్న రాము ఆధ్వర్యంలో మా ఇల్లు ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మహేష్ తో కేక్ కట్ చేయించి రాబోయే రోజుల్లో ఉన్నతంగా ఎదగాలని సమాజంలో పేద సామాన్య వర్గాలకు అండగా నిలవాలని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బలంగా పోరాటం చేయాలని అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *