మంగళవారం సాయంత్రానికి 40 లక్షల ఆదాయం

Spread the love

విజయవాడ 30/9/2025

మంగళవారం సాయంత్రానికి 40 లక్షల ఆదాయం

దసరా ఉత్సవాలలో తొమ్మిదవ రోజు మంగళవారం సాయంత్రం 5 గం. సమయానికి పలు రకాల సేవల రూపేణా రూ. 40లక్షల 12వేల 917 రూపాయల ఆదాయం వచ్చిందని దుర్గ గుడి ఈవో శీనా నాయక్ ఒక ప్రకటన లో తెలిపారు. 15 రూపాయల లడ్డులు 13,390 విక్రయించగా రెండు లక్షల ఎనిమిది వందల యాభై రూపాయలు , వందరూపాయల లడ్డు బాక్స్ లు 35,192 విక్రయించగా రూ.35,19,200 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా ముప్పై మూడు వేలు, ప్రత్యేక పరోక్ష చండిహోమం ద్వారా 20 వేలు, అదేవిధంగా ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 25,580 రూపాయలు ఫోటో& క్యాలెండర్ల విక్రయం ద్వారా 4,890 రూపాయలు, కేశఖండన ద్వారా రూ.2,03,640 ఇతరత్రా 5,757 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.

సాయంత్రం 5 గంటల సమయానికి 98,418 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు.
చిన్నారులు తప్పిపోకుండా 3,977 ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 28,681 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *