30- 09- 25*
ఘంటసాలలో భక్తి గీతాల సంగీత విభావరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ “విజయవాడ ఉత్సవ్” నగరంలోని ఘంటసాల ప్రభుత్వ కళాశాల నందు 9వ రోజు సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం ఎస్.ఎస్.ఎస్.పి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ గురువులు సురభి కందాల శిష్యురాలు విజయవాడకు చెందిన జీ. సాహతి చేసిన పాటల కచేరీ శ్రోతలను బాగా అలరించింది. సుందర కీర్తనలతో సంగీత ప్రియులను అలరించారు. శాంభవి వర్ణం, రాగమాలిక, ఓంనమో నమః శివాయ, మాయాగీత కృతి, దుర్గాదేవి జనని గేయాలతో సభను ఆహ్లాదభరితంగా మార్చారు. సంగీత కచేరీ లో మృదంగం విమలేశ్వర రావు, వయోలిన్ సి.హెచ్ శ్రీదేవి సహకారాలు అందించారు.
![]()
