చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంధి

Spread the love

30-9-2025

చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంధి

P-4 అమలు ద్వారా సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు  కల్పిస్తున్నాం

ధి :-30-9-2025 మంగళవారం ఉదయం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వయం ఉపాధిలో భాగంగా P4 పథకం ద్వారా అర్హులైన రాజీవ్ నగర్ కు చెందిన నాగేశ్వరరావు కి టిఫిన్ బండి పంపిణీ కార్యక్రమం లో పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు అర్హులైన చిరు వ్యాపారులకు టిఫిన్ బండిని అందజేశారు…

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం లో వివిధ జోన్లలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించడానికి జోన్లు గా విభజించి గ్రీన్ జోన్, రెడ్ జోన్, మరియు ఆరెంజ్ జోన్ వంటివిగా వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించామని…

ఈ జోన్లలో ఎవరైతే బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నారో, వారికి ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు అందిస్తూ కూరగాయలు, ఫ్రూట్స్ గాని, లేదంటే తిరుబండరాలు అమ్ముకునే వారు, లేదా మరే ఇతర చిన్న వ్యాపారాలు చేసే వారు ఎవరైనా సరే, వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీస్ అధికారులు గాని, ఇతర పోలీస్ సిబ్బంది గాని, మున్సిపల్ అధికారులు గాని, లేదా మరే ఇతర అధికారులు గాని ఈ చిరు వ్యాపారులను వ్యాపారానికి ఆటంకాలు చేయకుండా, ఫైన్లు రాయకుండా, వారి వ్యాపార కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూసుకోవాలని తాను, ప్రభుత్వం ఆదేసాలు ఇచ్చాము అని, ఇది చిరు వ్యాపారులకు ఒక పెద్ద ఊరటనిస్తుంది అని

2029 నాటికి పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే మహోన్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలనకు P-4 అనే నూతన విధానాన్ని ప్రారంభించారు అని,  ఈ విధానం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలను ఆర్థికంగా స్వతంత్రులుగా చేసి, వారి జీవన ప్రమాణాలను  మెరుగుపరచడమే  ప్రధాన  ఉద్దేశ్యం అని, P4 కార్యక్రమం ద్వారా  పేద కుటుంబాలకు  విద్య, వైద్యం, ఉపాధి,  వంటి  ప్రాథమిక  అవసరాలను  అందించడంతో పాటు,  వారికి  ఆర్థిక  సాయం,  నైపుణ్య  అభివృద్ధి  శిక్షణ  కూడా  కల్పించనున్నాం అని, ఇలా సమగ్ర  అభివృద్ధి  ద్వారా  బడుగు, బలహీన కుటుంబాలను బంగారు  కుటుంబాలుగా మార్చి, రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా  నిర్మూలించాలని  ప్రభుత్వం  కృతనిశ్చయంతో  ఉంది అని..

ఇందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 250 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం అని,  ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు ఐడి కార్డులు ఇచ్చామని

వారి వ్యాపారం ద్వారా రోజుకు వెయ్యి నుండి వెయ్యిన్నర రూపాయల వరకు సంపాదించుకునేలా అవకాశం కల్పించామని, ప్రభుత్వం 15,000 రూపాయల రుణం ఎటువంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని,  చిరువ్యాపారులకు ఈ సదుపాయం తోడ్పడుతుందని.

 పార్టీ నాయకులు తమ సొంత నిధులతో టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు వంటి వసతులు కూడా కల్పిస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P-4 పథకం కింద అన్ని రకాలుగా పేదవారికి సహాయం అందిస్తామని, వీటితోపాటు అవసరమైన వారికి ఇస్త్రీ పెట్టెలు, వినికిడి సమస్య ఉన్నవారికి వినికిడి యంత్రాలు, అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నవారికి ట్రై సైకిల్స్, చార్జింగ్ ద్విచక్ర వాహనాలు, వంటివి అందజేస్తున్నామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *