రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి
దుర్గామాత అనుగ్రహం ఉంటుంది*
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ :
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని శ్రీ సరస్వతీ దేవి అలంకృత దుర్గామాతను ప్రార్ధించినట్లు సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామాతను సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. ఆలయ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు జగజ్జనని అనుగ్రహం ఉండాలని సరస్వతి మాతను కోరుకున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేందుకు ఈ విజయదశమి నాంది కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
![]()
