దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది…
— రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ :
జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సరస్వతీ దేవి అలంకృత జగన్మాతను ఆయన సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. గౌరవ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని జగన్మాతను ప్రార్థించానని చెప్పారు. భక్తులకు అవసరమైన ప్రతి అంశంలోనూ అన్ని శాఖలు బాధ్యతగా పనిచేస్తున్నాయన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని అధికారులకు తెలియజేసేందుకు మీడియా కూడా చాలా చక్కగా తన బాధ్యత నిర్వర్తిస్తోందన్నారు.
![]()
