మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంద్ర కీలాద్రి పై కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

Spread the love

విజయవాడ
మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంద్ర కీలాద్రి పై కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
చంద్రబాబు, ముఖ్యమంత్రి
• ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను.
• రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని దుర్గమ్మను కోరుకున్నాను.
• దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయి.
• ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి…రాష్ట్ర సంపద పెరగాలి.
• నవరాత్రుల సందర్భంగా ఇప్పటి వరకూ 8 లక్షల మంది దుర్గమ్మ దర్శనం పొందారు.
• ఇవాళ ఒక్క రోజే 1.20 లక్షల మంది దుర్మమ్మను దర్శించుకున్నారు.
• భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.
• పవిత్రతను కాపాడుతూ ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశాం.
• ప్రసాదంలో నాణ్యత పెంచాం, వీఐపీ దర్శనాలను క్రమబద్దీకరించాం.
• ఎక్కువ సమయం సాధారణ భక్తులకే కేటాయించాం.
• దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.
• ప్రజలకు సేవ చేస్తున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
• 2014-19 మధ్య కాలంలోనే దుర్గ గుడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం.
• నేడు మళ్లీ అభివృద్ది పనులు చేస్తున్నాం. ఒకేసారి 1,500 మందికి సరిపడేలా రూ.26 కోట్లతో అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నాం. ఆరు నెలల్లో అది అందుబాటులోకి వస్తుంది.
• రూ.27 కోట్లతో నూతన ప్రసాదం తయారీ కేంద్రం మూడు నెలల్లో పూర్తి చేస్తాం.
• రూ.5 కోట్లతో పూజా మండపం, దాతల సహకారంతో యాగశాల నిర్మిస్తాం.
• రూ.14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి పనులు ఐదు నెలల్లో పూర్తి చేస్తాం.
• 2027 గోదావరి, 2028 కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తాం.
• ప్రభుత్వం చేసే మంచి పనులకు దుర్గమ్మ దీవెనలుండాలి.
• దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నాం. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాం.
• తిరుమల కొండపై ఉన్నంత స్థలం..ఇంద్రకీలాద్రిపై లేదు. విజయవాడ నగరంలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం.
• ఆదాయం లేని దేవాలయాలకు ప్రభుత్వం నిధులు ఇస్తోంది.
• ప్రముఖ దేవాలయాలకు డబ్బులు కొదవ లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కొల్లు రవీంద్ర ఎంపీ కేసీఆర్ శివనాద్ చిన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈవో శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *