అమ్మవారి ఆశీస్సులు ప్రజల సుఖశాంతులకు, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి : ఎంపీ కేశినేని శివనాథ్

Spread the love

అమ్మవారి ఆశీస్సులు ప్రజల సుఖశాంతులకు, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి : ఎంపీ కేశినేని శివనాథ్

మూల నక్షత్రం సందర్భంగా కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించిన ఎంపీ

దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ దంపతులు

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం ఉదయం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సతీమణి జానకిలక్ష్మి, తనయుడు వెంకట్ పాల్గొన్నారు. సరస్వతీ దేవి అలంకారంలో కొలువైన అమ్మవారిని ఎంపీ కుటుంబ సమేతంగా దర్శించుకుని, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యకరమైన జీవనం, సుభిక్షాభివృద్ధి కోసం ప్రార్థించారు. దర్శనం అనంతరం వేదపండితులు ప్రత్యేక వేదాశీర్వచనాలు అందించి, ఎంపీ దంపతులకు అమ్మవారి ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు రెండోసారి లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి కరుణ, అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంతో జీవించాలి. మన రాష్ట్రం, మన దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని నేను మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *