విజయదశమి రోజున అన్ని క్యూ లైన్లలోనూ ఉచిత దర్శనాలే : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Spread the love

విజయదశమి రోజున అన్ని క్యూ లైన్లలోనూ ఉచిత దర్శనాలే : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విఐపి ల దర్శన సమయాన్ని కుదించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సరస్వతి దేవిగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తుల తరలివస్తున్నారని, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల దర్శనం సజావుగా సాగుతోందని చెప్పారు. ఎనిమిది రోజుల దసరా నిర్వహణ వివరాలను ఆయన తెలియజేస్తూ…
ఈ ఎనిమిది రోజులలో 8 లక్షల మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రానికి లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 12 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా ఎనిమిది రోజులలో 40 వేలమంది కి ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 2,80,000 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. లక్ష మందికి ఉచిత లడ్డు ప్రసాదం, 35 లక్షల మంచినీటి బాటిల్స్, 6,600 లీటర్ల పాలు, 3 లక్షల 60 వేల మజ్జిగ పాకెట్లు, 1,75, 000 బిస్కెట్ పాకెట్స్ పంపిణీ చేశామన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు 17, అంబులెన్సులు 5, తాత్కాలిక మరుగుదొడ్లు 370 ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, దివ్యంగుల కోసం 8 మినీ బస్సులు, రెండు బ్యాటరీ కార్లు, 20 చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచామన్నారు. వినాయక గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు ఉన్న క్యూ లైన్ లో 12,000 మంది వేచి ఉండొచ్చని, హోల్డింగ్ ప్రాంతాలలో పదివేలమంది ఉండొచ్చని తెలిపారు.

దసరా రోజున ఎలాంటి విఐపి పాసులు, దర్శనాలు ఉండవని అన్ని క్యూ లైన్లలోనూ ఉచిత దర్శనమే ఉంటుందని చెప్పారు. ఆరోజున కూడా క్యూ లైన్ లో ఉన్న అందరికీ ఉచిత లడ్డు ప్రసాదం అందజేస్తామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈవో శీనా నాయక్ తదితరులు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *