28-9-2025
హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి, దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం- MLA బొండా ఉమ
ఈ ప్రభుత్వం విజయవాడలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది, నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు- MLA బొండా ఉమ
సత్యనారాయణ పురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేపించిన – MLA బొండా ఉమ
ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ తగిన కృషి చేయాలి
ధి:28-9-2025 ఆదివారం ఈరోజు ఉదయం విజయవాడ సత్యనారాయణ పురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు 10 మంది నూతన పాలకవర్గ మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది…
ఈ కార్యక్రమంలో ఎన్నికైన సభ్యులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నూతన సభ్యులకు శాలువాతో సత్కరించి అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు, ఆలయ అభివృద్ధికి కొత్త కమిటీ తగిన కృషి చేయాలని సూచించారు
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-నామినేటెడ్ పోస్టుల్లో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటివరకు అనేక పదవులు కేటాయించామని, విజయవాడ సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన పెర్ల వెంకట మురళీధర్, డైరెక్టర్లుగా శ్రీ వేపాడ వెంకట రమణ, వీరుబోటి అరుణ్ కుమార్ శర్మ, జీడిగుంట వెంకట సత్య రామ లక్ష్మి, కనుపతి శేషమ్మ, పరుసు నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, సొంటి ఈశ్వరి గౌడ్, చిలువేరు భాగ్యలక్ష్మి, పొట్లూరి కృష్ణ ప్రసాద్ ను నియమించబడినందుకు సంతోషంగా ఉందని…
దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచడానికి, భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది అని, గతంలో జరిగిన అభివృద్ధి పనులను కొనసాగిస్తూ, కొత్త ప్రాజెక్టులను కూడా చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని, దేవస్థానం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరచడానికి, భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించడానికి ఈ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేస్తారు అని, దేవస్థానం యొక్క చరిత్ర, సంస్కృతిని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందించడానికి కూడా ఈ కమిటీ కృషి చేస్తుంది అని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ గార్లపాటి విజయకుమార్, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు బడేటి ధర్మారావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, పేర్ల రవి, తదితర నాయకులు, కార్యకర్తలతో పాటు వందలాదిమంది పాల్గొన్నారు
![]()
