మూల నక్షత్రం రోజు భ‌క్తులు స్వీయ నియంత్ర‌ణ పాటించాలిఅమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు స‌క‌ల స‌దుపాయాలు ఏర్పాటుసోమ‌వారం

Spread the love

28-09-2025 మూల నక్షత్రం రోజు భ‌క్తులు స్వీయ నియంత్ర‌ణ పాటించాలిఅమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు స‌క‌ల స‌దుపాయాలు ఏర్పాటుసోమ‌వారం ( రేపు) ఎలాంటి పాసుల‌కు అనుమ‌తి లేదు ఇంద్ర‌కీలాద్రి మీడియా పాయింట్ లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి విజ‌య‌వాడ : దుర్గామాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దేవస్థానానికి అమ్మవారి దర్శనం కోసం 1.75 లక్షల నుంచి రెండు లక్షల వరకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం, అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని) అన్నారు. పార్లమెంటు సభ్యులు శివనాథ్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున ఎటువంటి పాసులకు అనుమతి ఉండదని, స్వీయ నియంత్రణ పాటిస్తే సామాన్య భక్తులు సత్వరమే దర్శనం చేసుకోగలుగుతారన్నారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారన్నారు. మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మను వేడుకున్నానన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *