18-3-2025
90 రోజుల శిక్షణ అనంతరం సర్టిఫికెట్స్ తో కూడిన కుట్టు మిషన్లు మహిళలకు అందించడం జరుగుతుంది
ధి:18-3-2025 మంగళవారం అనగా ఈరోజు సాయంత్రం 04:00″ గం లకు ” 30వ డివిజన్ RMP అసోసియేషన్ హాలు నందు సెంటర్ ఫర్ అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం అయినది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలను వివరించారు
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, స్వశక్తితో సాధికారతను, సమానత్వాన్ని సాధిస్తున్నారు, తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు
ఈరోజు నియోజకవర్గ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందించి వారికి కుట్టు మిషన్లు అందించడం చాలా సంతోషించదగ్గ అంశమని, రానున్న రోజులలో మహిళలకు అవకాశాలు ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా ఆకాశమే హద్దుగా అవసరమైతే మగవారి కన్నా మిన్నగా ఆర్థికంగా బలోపేతమై కుటుంబన్ని ఆదుకునే విధంగా ముందుకు సాగిస్తారని ఈ శిక్షణ కేంద్రంలో పాల్గొనేటువంటి 200మంది మహిళా మణులకు వివిధ సూచనలు చేస్తూ, ఉదయం సెక్షన్లో 100మంది, మధ్యాహ్నం సెక్షన్ లో 100 మంది పూర్తిస్థాయిలో ఈ శిక్షణ కేంద్రంలో కటింగ్ మొదలుకొని అన్ని మేలుకోవాలి నేర్చుకొని 90 రోజుల అనంతరం వారికి సర్టిఫికెట్ తో పాటు ఉచితముగా కుట్టు మిషన్లు అందిస్తామని బొండా ఉమా వివరించారు
ఈ కార్యక్రమంలో
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆధర్ చైర్మన్
గొట్టుముక్కల రఘురాంరాజు, ఘంటా కృష్ణమోహన్,గొట్టుముక్కల శేషం రాజు, చౌదరి సూర్యనారాయణ, గరిమెళ్ళ రాధిక, వేపాడ వెంకటరమణ, ట్రైనింగ్ కనకదుర్గ,కుమార్
తదితరులు పాల్గొన్నారు.