
విజయవాడ నగరపాలక సంస్థ
20-11-2025
7000 కు పైగా స్వయం సహాయక బృందాల మహిళలకు సఖి సురక్ష ద్వారా ఉచిత వైద్య మరియు క్యాన్సర్ పరీక్షలు
7000 కు పైగా స్వయం సహాయక బృందాల మహిళలకు సఖి సురక్ష ద్వారా ఉచిత వైద్య మరియు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని విజయవాడ నగరపాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ అన్నారు.
విజయవాడ నగర పరిధిలో మంగో మార్కెట్ వి.ఎం.సి కల్యాణ మండపం, ఐ. వి ప్యాలెస్, పటమట హైస్కూల్ రోడ్ వద్ద ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ కళ్యాణ మండపంలో సఖి సురక్ష ఆరోగ్య శిబిరాలను విజయవాడ నగరపాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూ సి డి) పి. వెంకటనారాయణ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో ప్రభుత్వం స్వయం సహాయక బృందాలలో 35 సంవత్సరాలు దాటిన మహిళల కోసం సమగ్ర హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ, అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15, 2025 ను ప్రారంభించారని, నవంబర్ 21, 2025 వరకు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 20, 2025 సాయంత్రం ఐదు గంటల వరకు ఏడు వేలకు పైగా మహిళలకు థైరాయిడ్, హిమోగ్లోబిన్, మూడు రకాల క్యాన్సర్ పరీక్షలు చేశారని అన్నారు. కావున 35 సంవత్సరాలు పైబడిన స్వయం సహాయక బృందం మహిళలందరూ నవంబర్ 21, 2025 ఉచిత వైద్య శిబిరమునకు ఆఖరి రోజు అయినందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎక్స్పర్ట్ జి.ఎస్ సుజాత, సి.డి.ఒ లు శ్రీకాంత్, జగదీశ్వరి, ఉమామహేశ్వరి , సి ఎల్ ఆర్ పి లు, సిబ్బంది పాల్గొన్నారు.
![]()
