500 కోట్ల రూపాయలతో మోసం చేసిన వైసీపీ నాయకుల పై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులు అందరికీ తిరిగి వారి సొత్తుని వారికి ఇవ్వాలి

2
0

24-6-2025

500 కోట్ల రూపాయలతో మోసం చేసిన వైసీపీ నాయకుల పై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులు అందరికీ తిరిగి వారి సొత్తుని వారికి ఇవ్వాలి

రాజకీయ ఊసరవెల్లి అయిన గోగుల రమణ కుమారుడు, గోగుల విజయ్ ఒక్కడే దోషి కాదు, డైరెక్టర్ గా ఉన్న వారి తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి రాజకీయలను అడ్డం పెట్టుకొని ముందుకు సాగి వారి కుటుంబం యావత్తు ని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలి

రాజకీయ ఊసరవెల్లి అయిన వైసీపీ నాయకులు గోగుల రమణని తక్షణమే పోలీసులు విచారించి, దీనికి బాధ్యులైన వారి అందరిపై కేసులు బనాయించి న్యాయస్థానానికి పంపి సొత్తు రికవరీ చేయాలి గోగుల విజయ్ కుమార్  ( గోగుల రమణ ) ఇంటి ఎదుట పెద్ద ఎత్తున వర్షంలో ప్రజా సంఘాల నిరసన ఆందోళన

ధి:-24-6-2025 మంగళవారం సాయంత్రం  5:00″గం లకు ” సింగ్ నగర్ లూనా సెంటర్లోని గోగుల విజయ్ కుమార్ ( వైయస్సార్సీపీ నాయకుడు గోగుల రమణ కుమారుడు) ₹500 కోట్ల రూపాయలకు పైబడి ప్రజలను మోసం చేస్తూ రియల్ ఎస్టేట్ పేరుతో, చిట్టీల పేరుతో, ఫైనాన్స్ పేరుతో వివిధ రూపాలలో దగా చేసి ప్రజలను మోసం చేసిన గోగుల  విజయ్ ను అరెస్టు చేయడమే కాకుండా దానికి సంబంధించిన కమిటీ మెంబర్లు అందర్నీ, దీనికి సహకరించిన గోగుల విజయ్ కుమార్ తండ్రి వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ను కూడా తక్షణమే అరెస్టు చేసి బాధితులందరికీ న్యాయం చేయాలి అని ప్రజాసంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరారు…

ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ  SC సెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్, తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జయపాల్, మైనారిటీ అధ్యక్షులు Sk బాషా, TNTUC అధ్యక్షులు గరిమెళ్ళ చిన్న, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గౌడ్ లు మాట్లాడుతూ:-

గత లో అనేకమార్లు వివిధ కేసులలో ముద్దాయి అయినటువంటి గోగుల విజయ్ కుమార్ విజయవాడలోనే కాకుండా బాపట్ల, గుంటూరు, ప్రధానంగా హైదరాబాద్ లను కేంద్రంగా చేసుకొని భువనగిరి పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, విజయవాడ వైఎస్ఆర్సిపి మాజీ ప్రజా ప్రతినిధులను అండతో గోగుల రమణారావు సహకారంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో ముద్దాయి గోగుల రమణ భార్య అయినటువంటి గోగుల అన్నపూర్ణమ్మ కుటుంబం ప్రజలను మోసం చేసి ₹500 కోట్ల రూపాయలకు ప్రజలను మోసం చేసిందని, ఇప్పటికే హైదరాబాదులోని పలు స్టేషన్లలో కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు చేశారని, ప్రజలను గోగుల కుటుంబం చేసినటువంటి మోసానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారని

విజయవాడలో ప్రజా సంఘాలుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలుగా తాము ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే ఖండిస్తూ నష్టపోయినటువంటి బాధితులు అందరికీ వారి సొమ్మును వారికి తిరిగి ఇవ్వాలని, గతంలో గోగుల విజయ్ కుమార్ మీద అనేక కేసులు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో, నున్న పోలీస్ స్టేషన్లో, నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో కూడా ప్రజలు కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు…

ఆనాడు గోగుల విజయకుమార్ తండ్రి గోగుల రమణ వైఎస్ఆర్సిపి నాయకులు అవ్వడం వల్ల రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని విజయవాడ నగరంలోనే 30 డివిజన్ దేవీ నగర్ లో ఉన్నటువంటి ట్రెండ్ సెట్ లో పెద్ద ఎత్తున వందల గజాలలో బిల్డింగులు నిర్మింప చేయడమే కాకుండా, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను కబ్జా చేసినటువంటి చరిత్ర వీరి కుటుంబానికి ఉన్నది అని, గతంలో సింగ్ నగర్ ప్రాంతంలో అనేకమార్లు చిట్టీల పేరుతో ప్రజల నుండి సొమ్మును రాబట్టి చిట్టీలు పాడిన వారికి కూడా చిట్టి డబ్బులు జమ చేయకపోవడం, వారికి పెద్ద ఎత్తున ఫైనాన్సు కాల్ మనీ ఇవ్వడం తో అనేకమంది కేసులు పెట్టగా విజయవాడ నుండి పారిపోయి వారి తండ్రి గోగుల రమణ అండదండతో తిరిగి నేడు ₹500 వందల కోట్ల రూపాయలకు ప్రజలను మోసం చేశారని…

ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయస్థానం ముందు నుంచో పెట్టాలి అని, వారి మీద కేసులు పెట్టి బాధితులు అందరికీ న్యాయం చేయవలసినటువంటి బాధ్యత తమకు ఉంది అని, బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నటువంటి గోగుల రమణ ఈరోజు కైనా నోరును అదుపులో పెట్టుకోకపోతే రేపు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి నిరసన శాంతియుత ఆందోళనలకు అతని బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించి పోలీసులు దీనిపైన విచారణ జరిపి దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమోటుగా తీసుకొని బాధ్యతలు అందరికీ కూడా న్యాయం చేయాలని, కానటువంటి పరిస్థితులలో దశల వారి ఆందోళనలకు ప్రజాసంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించారు….

ఈ కార్యక్రమంలో:- 59 వ డివిజన్ అధ్యక్షులు బంగారునాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఇంచార్జ్ Sk జాన్ వలి, మద్దాల మహేష్, వెంకటేశ్వరరావు, డోల జనార్ధన్, ప్రవీణ్, బెదవాడ తిరుపతి, సాంబశివరావు, కార్యం శెట్టి లూర్డ్ రాజు, రాము, Sk మెహర్, ఇందిరా, నాగమణి, Sk గౌసియా, SD గౌసియా, జిల్లు, నయీమ్, అశోక్, నాగరత్నం, హరమ్మ, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here