44 డివిజన్ లేబర్ కాలనీలో వైకాపా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం అక్రమ నిర్మాణం పై చర్యలు చేపట్టాలి మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకరన్ కు ఫిర్యాదు చేసిన.. జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్

Spread the love

 44 డివిజన్ లేబర్ కాలనీలో వైకాపా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం అక్రమ నిర్మాణం పై చర్యలు చేపట్టాలి 

విజయవాడ

మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకరన్ కు ఫిర్యాదు చేసిన..

జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్

 విజయవాడ, జూన్ 24 

 అక్రమంగా పశ్చిమ నియోజకవర్గంలోని 44 డివిజన్ లేబర్ కాలనీలో వైకాపా జిల్లా కార్యాలయం నిర్మాణం చేయడంపై తగు చర్యలు చేపట్టాలని

విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకరన్ కు 

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాధిత శంకర్ ఫిర్యాదు చేశారు సోమవారం విజయవాడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమంలో కమిషనర్ స్వప్నికల్ కు జనసేన నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. 

పశ్చిమ నియోజకవర్గం లో లేబర్ కాలనీలో అక్రమంగా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని ఈ అక్రమ నిర్మాణం పై తక్షణమే చర్యలు చేపట్టాలని జనసేన నేతలు కోరారు. 

ఈ ఫిర్యాదు పై స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత అక్రమ నిర్మాణం పై చర్యలు ఉంటాయని తెలియజేశారు. 

విజయవాడ నగరంలో 

అక్రమంగా వైయస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేశారని ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని వీటిని తొలగించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జనసేన నగర కార్యదర్శి శనివారపు శివ, ఉపాధ్యక్షులు కాపు వెంకట్ వడ్డీ, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *