
41వ డివిజన్ లోని సమాఖ్య మహిళల అవగాహన సదస్సుకు విశేష స్పందన
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య భద్రత, సొంత ఇంటి స్థలాలు, ఆర్థిక పరమైన అంశాలపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది ..
భవాని పురం, భవాని ఘాట్ దగ్గర గల
సాయి అన్న గార్డెన్స్ లో గురువారం నిర్వహించిన వర్క్ షాప్ లో 41 వ డివిజన్ లోని స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
ఈ అవగాహన సదస్సు లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఒమేగా అను మై బేబీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక , సీ ఎల్ టీ ఎస్ సమత,
పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సత్య ప్రశాంత్, సీ ఓ నాగ రమ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలకు ఆరోగ్యపరమైన నైపుణ్యాభివృద్ధి పరమైన అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను గురించి తెలియజేశారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆర్థికపరమైన , ఆరోగ్య , నైపుణ్యాభివృద్ధి , సొంత ఇంటి స్థలాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
ఎన్డీయే కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా, మోహనలక్ష్మి, కావలి లక్ష్మీ , సుజనా మిత్రా తిరుపతి రెడ్డి సుజనా మిత్రా కోఆర్డినేటర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు..
![]()
