
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు సొమ్ము జమ.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 05.12.2025.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా కూటమి సర్కారు చర్యలు తీసుకుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవను అమలు చేసినట్లు పేర్కొన్నారు.
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన గోతాలు సిద్ధం చేశారని అన్నారు. తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు వెల్లడించారు.
రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి “7337359375” వాట్సాప్ నంబర్‌కు “హాయ్” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారని పేర్కొన్నారు.
సరైన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి, మద్దతు ధరలు పొందాలని రైతులకు సూచించారు. రైతులకు మద్దతు ధరలు దక్కేలా కొనుగోళ్లు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![]()
