
ఎన్ టి ఆర్ పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ
Dt.28-10-2025
Advika Trading Marketing Company చీటింగ్ కేసు లో ప్రధాన నిందితులు అరెస్టు
140 కోట్లు నస్థపోయిన సుమారు 1139 మంది డిపాజిటర్స్ ప్రధాన నింధితుడు, అతని భార్య కు సహకరించిన 2 ఏజెంట్స్ అరెస్టు
ది. 26.06.2025 వ తేదీన 14.30 గంటలకు ఫిర్యాదు విరమల్లు గణేష్ చంద్ర తను, తన కుటుంబ సభ్యులు ముద్దాయి తాడేపల్లి ఆదిత్యకు చెందిన అద్విక ట్రేడింగ్ కంపెనీలో ఆదిత్య మోసపూరిత మాటలు నమ్మి 53 లక్షలు డిపాజిట్ చేసినట్లు, దానికి గాను తిరిగి 13 లక్షలు ఇచ్చి కంపెనీ క్లోజ్ చేసి పారిపోయినట్లుగా ఇచ్చిన రిపోర్ట్ పై మాచవరం పోలీసు స్టేషన్ నందు Cr.No.248/2025 U/s 318(4), 316(2), 316(5), 61(2) BNS & Sec. 5 of The AP Protection of Depositors of Financial Establishment Act-1999 కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
సదరు కేసు లో బాదితులు సంఖ్య సుమారు 1355 మంది ఉండే సరికి కేసుని తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఈ కేసును క్రైమ్ డి.సి.పి. Dr.K.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. ఆద్వర్యం లో సెంట్రల్ ఏ.సి.పి. కె దామోదర రావు దర్యాప్తులో టాస్క్ ఫోర్స్ ఏసిపి లత కుమారి వారి సిబ్బంది మరియు 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పటుచేసి దర్యాప్తు చేయించడం జరిగినది.
దర్యాప్తులో భాగం గా 10 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నస్థపోయిన బాదితులు సుమారు 1355 మంది ను విచారించడం జరిగింది. ప్రధమ ముద్దాయి ఆదిత్య మరియు మిగిలిన ముద్దాయిల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ లను కూడా సేకరించడం జరిగినది. టెక్నికల్ సాక్షాలను కూడా సేకరించడమైనది.
ఈ నేపధ్యంలో ది.27.102025 సదరు ప్రత్యేక బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు సెంట్రల్ ఏ.సి.పి. కె దామోదర రావు వారి సిబ్బందితో కలిసి బల్లెం వారి వీధిలో శ్రీ లక్ష్మి ఎంక్లేవ్ అపాట్మెంట్ వద్ద A1 to A4 మరియు ఏజెంట్స్ లను అదుపులోనికి తీసుకుని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది.
నింధితుల వివరాలు :
- తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య, తండ్రి: వెంకట నంద కుమార్, వయసు 43 సం., కులం: వైశ్య, F.No.401, శ్రీ లక్ష్మీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్, గౌరీ శంకర్ నగర్ రోడ్డు, బల్లెం వారి వీధి, కానూరు పంచాయితీ, విజయవాడ
- తాడేపల్లి @ గంట సుజాత, భర్త: తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య, వయస్సు: 42 సం//లు, కులం: మాదిగ, F.No.401, శ్రీ లక్ష్మీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్, గౌరీ శంకర్ నగర్ రోడ్డు, బల్లెం వారి వీధి, కానూరు పంచాయితీ, విజయవాడ.
- గాధంశెట్టి బాల కృష్ణ మూర్తి @ బాల కృష్ణ, తండ్రి: వెంకటేశ్వర్లు, వయస్సు: 51 yrs, కులం: వైశ్య, ప్లాట్ నెంబర్ 102, KBS గ్రీన్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, లబ్బీపేట, విజయవాడ.
- గాధంశెట్టి నాగ లక్ష్మి కుమారి భర్త: బాల కృష్ణ మూర్తి @ బాల కృష్ణ, వయస్సు: 41 yrs, కులం: వైశ్య, ప్లాట్ నెంబర్ 102, KBS గ్రీన్, బృందావన్ కాలనీ, లబ్బీపేట, విజయవాడ
విచారణలో తేలినది ఏమిటంటే
A-1/ఆదిత్య మరియు అతని భార్య సుజాత 2022 వ సంవత్సరం లో “అద్విక ట్రేడింగ్ కంపెనీ” స్థాపించి ₹15 లక్షలు పెట్టుబడి పెట్టి, దుబాయి లో ఉన్న “కబానా అకౌంట్” ద్వారా ట్రేడింగ్ ప్రారంభించాడు. మొదట్లో పెద్దగా లాభాలు రాకపోయిన డబ్బులు సంపాదించాలన్న ఆశ తో అధిక లాభాల పేరుతో A-1 ఆదిత్య, అతని భార్య A-2 మరియు A-3 మరియు A-4 వరకు మరియు ఇతర ఏజెంట్ల సహాయంతో నెలకు 5% వడ్డీ, ఎజెంట్లకు 3–4% మోసపూరిత హామీ ఇచ్చి ప్రజల వద్ద నుండి అధిక మొత్తంలో డిపాజిట్స్ సేకరించినారు. ట్రేడింగ్‌లో లాభాలు లేకపోయినా కొత్త డిపాజిటర్స్ కట్టిన డబ్బులతో పాత డిపాజిటర్స్ కు వడ్డీ చెల్లించాడు. 2023లో వార్షికోత్సవం నిర్వహించి మరిన్ని డిపాజిట్లు సేకరించాడు. డిపాజిట్స్ సేకరించడంలో కొంత మంది ఏజెంట్స్ లాభాపేక్ష పడి A-1 కి సహకరించినారు. తర్వాత నిధులను “మల్టీ బ్యాంక్ గ్రూప్” అకౌంట్‌కి బదిలీ చేసి వ్యక్తిగత ప్రయోజనాలకు వాడాడు. తన పేరున, తన భార్య పేరున చేరస్తులు మరియు బంగారం కొనుక్కున్నారు. ఏజెంట్స్ కూడా వారి పేరున ఆస్తులు కొన్నారు.
విచారణలో 2022 నుండి ఇప్పటి వరకు అద్విక ట్రేడింగ్ కంపెనీ అధిక లాభాల ఆశ చూపి ప్రజలను మభ్యపెట్టి సుమారు 1450 మంది వద్ద నుండి సుమారు ₹400 కోట్లు డిపాజిట్ లు సేకరించి దానిలో కొంత భాగాన్ని దుబాయి లో ఉన్న cabana trading మరియు multi banking forex వంటి విదేశీ ప్లాట్‌ఫారమ్‌లకు బదిలీ చేసినట్లు తేలింది. డబ్బులకు ఆశ పడి కొంతమంది ఏజెంట్స్ ప్రజల కు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డిపాజిట్స్ సేకరించడంలో సహకరించినారు. ఆన్లైన్ ట్రేడింగ్ లో సుమారు 14 కోట్లు లాస్ వచ్చిన కొత్తగా సేకరించిన డిపాజిట్స్ నే పాతవారికి వడ్డీ క్రింద ఇచ్చినారు. డిపాజిట్ లలో సుమారు 4 కోట్ల రూపాయిలతో ఆదిత్య చేరస్తులు కొనుగోలు చేసినాడు. డిపాజిట్స్ దారులకు వడ్డీ కట్టలేని స్థితికి వచ్చేసరికి పారిపోయినాడు.
విచారణలో అద్విక ట్రేడింగ్ కంపెనీలో మూసివేసే సమయానికి సుమారు 1450 మంది డిపాజిటర్స్, 60 మంది ఏజెంట్స్ ఉండగా వారిలో 1150 మంది డిపాజిటర్స్ నస్థపోయిన డబ్బులు సుమారు 135 కోట్లు, సుమారు 25 ఏజెంట్స్ నస్తపోయింది 9 కోట్లు, మొత్తం 144 కోట్లు ఆదిత్య, అతని భార్య వారికి సహకరించినట్లుగా విచారణలో తెలినది. ఈ కేసు లో ముద్దాయిల యొక్క సుమారు 100 కోట్ల విలువైన చేరస్తులను గుర్తించడమైనది.
A1, A2 అరెస్టు సంధర్భం లో వారి వద్ద నుండి ₹23 లక్షలు నగదు, 580 గ్రా// బంగారం వస్తువులు, 8.3 kg వెండి వస్తువులు, టాటా సఫారి కారు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం జరిగినది.
ఈ కేసు విచారణలో కృషి చేసినటువంటి సెంట్రల్ ఏసిపి K. దామోదర రావు, టాస్క్ ఫోర్స్ అయిన K.లత కుమారి మరియు ఇన్స్పెక్టర్ లు A.సుబ్రహ్మణ్యం, Ch. ప్రకాష్, వాసిరెడ్డి శ్రీను, A.పవన్ కిశోర్, N.రాజశేఖర్, D.చవాన్, B.చంద్ర శేఖర్, K.కిశోర్ బాబు లను మరియు క్రైమ్ డి.సి.పి. Dr.K. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. ని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ప్రత్యేకం గా అభినంధించడమైనది.
![]()
