బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ లేరు , ఒక్క ఎమ్మెల్యే లేరు. అయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఎలుతుంది. జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే బీజేపీ ఉన్నట్లే. హోదా వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిన రాజధాని లేదు. హైదరాబాద్ 10 ఏళ్లు ఇస్తే అవసరం లేదని వచ్చారు. ఇక్కడ ఏం ఉద్ధరించారు. రాష్ట్రానికి సిగ్గు చేటు. ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. రాష్ట్రం మాత్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఆంధ్ర అభివృద్ధి నాది అని మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీ సైతం నెరవేర్చలేదు అని’ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
![]()

