హరితాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములుకండి.. రాష్ట్రంలో 29 శాతం ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని 50 శాతం, జిల్లాలో 11 శాతం హ‌రిత విస్తీర్ణాన్ని 33 శాతానికి

4
0

ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 05, 2025 హరితాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములుకండి.. రాష్ట్రంలో 29 శాతం ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని 50 శాతం, జిల్లాలో 11 శాతం హ‌రిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచుదాం రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు, జిల్లాలో 2 లక్షల 60 వేల మొక్కలను నాటి స్వర్ణాంధ్రను సాకారం చేద్దాం రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి, ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్‌ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, జిల్లా ఇన్చార్జి మంత్రివ‌ర్యులు సత్య కుమార్ యాదవ్ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం -2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి వద్ద నగరవనం వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీశ మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటుదాం…. పర్యావరణాన్ని కాపాడుదాం… అనే వినాదంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతౌల్యత పాటు జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వ హ‌యాంలో మొక్కలు నాటడం మాని చెట్లను నరికివేసేవారన్నారు. గౌర‌వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గౌర‌వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ విలువను ప్రతి ఒక్కరు గుర్తించారని అన్నారు. ఒక చెట్టు తన జీవిత కాలంలో 50 నుండి వంద సంవత్సరాల కాలంలో రూ. 10 లక్షలు విలువైన ఆక్సిజన్ ప్రకృతికి అందిస్తుందన్నారు. వాతావరణంలో కార్బ‌న్ డై ఆక్సైడ్ శాతాన్ని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయన్నారు. పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి వరదలు తుఫానులతో అపార నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెట్టును అమ్మతో పోలుస్తూ ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి) అని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలను మన పిల్లలకు నేర్పి వారిలో అవగాహన పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 29 శాతం గ్రీనరీని స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి 50 శాతం పెంచేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం అనే వినాదంతో హ‌రిత విస్తీర్ణాన్ని పెంచి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవుదామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.*వ‌సంత గ్రీన్ ప్రాజెక్టును అమ‌లుచేస్తున్నా: ఎమ్యెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌*స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నేడు పర్యావరణ సమతౌల్యత దెబ్బ తినడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. బుడమేరుకు ఆకస్మిక వరదలు సంభవించి నష్టాన్ని కలిగించా యని ఉదహరించారు. పకృతిని దూరం చేయకుండా దగ్గరకు తీసుకుందాం అన్నారు. చెట్లను పెంచడం సామాజిక స్పృహగా భావించి ప్రకృతిని కాపాడుకుందాం అన్నారు. తాను ప్రకృతి ప్రేమికుడునని వసంత గ్రీన్ ప్రాజెక్ట్ పేరుతో పెద్దఎత్తున మొక్కలనునాటి సంరక్షిస్తున్నానని శాసనసభ్యులు అన్నారు.*హ‌రిత విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ మానసిక వికాసానికి యోగాంధ్ర దోహదపడుతున్నట్లే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలను నాటి పచ్చదనం పెంచుదామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11 శాతం ఉన్న గ్రీనరీని 33 శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలు, రహదారులకు ఇరుపక్కల, గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, దేవాలయాల ఆవరణలో అటవీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ శాఖల సమన్వయంతో ఈ ఏడాది 2 లక్షల 60 వేల మొక్కలను నాటేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.కార్యక్రమంలో విజయవాడ ఆర్డిఓ కావూరి చైతన్య, జిల్లా అటవీ శాఖ అధికారి జి. సతీష్, డిపిఓ పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, డ్వామా పీడీ ఎ.రాము, జిల్లా అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి.రాజు తదితరులు ఉన్నారు.(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌**ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 05, 2025**హరితాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములుకండి…*- *రాష్ట్రంలో 29 శాతం ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని 50 శాతం, జిల్లాలో 11 శాతం హ‌రిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచుదాం*- *రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు, జిల్లాలో 2 లక్షల 60 వేల మొక్కలను నాటి స్వర్ణాంధ్రను సాకారం చేద్దాం* – *రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి, ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్‌*మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, జిల్లా ఇన్చార్జి మంత్రివ‌ర్యులు సత్య కుమార్ యాదవ్ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం -2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి వద్ద నగరవనం వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీశ మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటుదాం…. పర్యావరణాన్ని కాపాడుదాం… అనే వినాదంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతౌల్యత పాటు జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వ హ‌యాంలో మొక్కలు నాటడం మాని చెట్లను నరికివేసేవారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ విలువను ప్రతి ఒక్కరు గుర్తించారని అన్నారు. ఒక చెట్టు తన జీవిత కాలంలో 50 నుండి వంద సంవత్సరాల కాలంలో రూ. 10 లక్షలు విలువైన ఆక్సిజన్ ప్రకృతికి అందిస్తుందన్నారు. వాతావరణంలో కార్బ‌న్ డై ఆక్సైడ్ శాతాన్ని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయన్నారు. పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి వరదలు తుఫానులతో అపార నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెట్టును అమ్మతో పోలుస్తూ ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి) అని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలను మన పిల్లలకు నేర్పి వారిలో అవగాహన పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 29 శాతం గ్రీనరీని స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి 50 శాతం పెంచేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం అనే వినాదంతో హ‌రిత విస్తీర్ణాన్ని పెంచి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవుదామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.*వ‌సంత గ్రీన్ ప్రాజెక్టును అమ‌లుచేస్తున్నా: ఎమ్యెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌*స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నేడు పర్యావరణ సమతౌల్యత దెబ్బ తినడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. బుడమేరుకు ఆకస్మిక వరదలు సంభవించి నష్టాన్ని కలిగించా యని ఉదహరించారు. పకృతిని దూరం చేయకుండా దగ్గరకు తీసుకుందాం అన్నారు. చెట్లను పెంచడం సామాజిక స్పృహగా భావించి ప్రకృతిని కాపాడుకుందాం అన్నారు. తాను ప్రకృతి ప్రేమికుడునని వసంత గ్రీన్ ప్రాజెక్ట్ పేరుతో పెద్దఎత్తున మొక్కలనునాటి సంరక్షిస్తున్నానని శాసనసభ్యులు అన్నారు.*హ‌రిత విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ మానసిక వికాసానికి యోగాంధ్ర దోహదపడుతున్నట్లే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలను నాటి పచ్చదనం పెంచుదామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11 శాతం ఉన్న గ్రీనరీని 33 శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలు, రహదారులకు ఇరుపక్కల, గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, దేవాలయాల ఆవరణలో అటవీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ శాఖల సమన్వయంతో ఈ ఏడాది 2 లక్షల 60 వేల మొక్కలను నాటేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.కార్యక్రమంలో విజయవాడ ఆర్డిఓ కావూరి చైతన్య, జిల్లా అటవీ శాఖ అధికారి జి. సతీష్, డిపిఓ పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, డ్వామా పీడీ ఎ.రాము, జిల్లా అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి.రాజు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here