ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.19.0,7.2025
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా భవిష్యత్తు తరాల భద్రత కోసం పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.
పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లోను, ఏ.సి.పి. ఆఫీసుల్లోనూ, డి.సి.పి.ఆఫీసుల్లో, ఎస్.బి. సి.సి.ఆర్.బి. ఆఫీసుల్లోనూ,పనికిరాని సామాన్లను తీసివేసి శనివారం నాడు ఉదయం శుభ్రపరిచినారు. పోలీసు స్టేషన్ పరిసార ప్రాంతాలు శుభ్ర పరచడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ముఖ్య ఉద్దేశంతో అధికారులు మరియు సిబ్బంది వారి వారి పోలీస్ స్టేషన్లలో, కార్యాలయాలలో పరిశుభ్రతను పాటించి శుభ్రపరిచినారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ, వృత్తి పట్ల క్రమశిక్షణ కలిగి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ ల సిబ్బంది మరియు అధికారులు సంబంధిత సబ్ డివిజన్లలో శనివారం నాడు ఉదయం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.